Hibiscus Flower: లక్ష్మీదేవికి ప్రీతికరమైన మందారం ఆర్ధిక ఇబ్బందులను కుజ దోషాన్ని తొలగిస్తుంది.. ఏ విధంగా పూజించాలంటే

|

Jun 21, 2024 | 4:48 PM

పువ్వుల్లో మందారం పువ్వుకు విశిష్ట స్థానం ఉంది. అందంగా కనిపించే ఈ మాదారం పూజలో ప్రముఖ స్థానం సొంతం చేసుకుంది. అందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మాదారం పువ్వు భాగవతంలో విశిష్టస్థానం సంపాదించింది. రకరకాల మందారం పువ్వులు ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్నాయి. ప్రతి ఇంట మందారం మొక్క కనిపిస్తుంది కూడా.. అటువంటి మందారం మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలున్నాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.

1 / 8
వాస్తుశాస్త్రం ప్రకారం, ఈ ఎరుపు రంగులో కాంతులీనుతూ ఉండే మందారం పువ్వు చౌకగా లభ్యం అవుతుంది. అంతేకాదు ఈ మందారం పువ్వు ఆర్థిక సంక్షోభం నుండి అప్పుల భారం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు అధిగమిస్తారని నమ్మకం. ఈ మొక్కను గార్డెన్ లో పెంచుకునేముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి.

2 / 8
చాలా మంది తమకు ఇష్టమైన గార్డెన్‌లో తమకు ఇష్టమైన రంగురంగుల పూల మొక్కలను పెంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే పువ్వులను సొంత పిల్లలా చూసుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రకృతి ఒడిలో అందమైన మొక్కల మధ్య గడపడాన్ని ఇష్టపడేవారు ఉన్నారు. పువ్వులు చూడటానికి అందంగా ఉండడమే కాదు సువాసన వెదజల్లుతూ మనసుని పులకరింపజేస్తాయి కూడా..

3 / 8
దాదాపు ప్రతి ఒక్కరూ రంగు రంగుల పువ్వులను, సువాసనను ఇష్టపడతారు. దేవతలకు కూడా పువ్వులు అంటే ఇష్టం. హిందూ మతంలో పువ్వులు సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. పువ్వులు పర్యావరణపరంగా కూడా ముఖ్యమైనవి. పువ్వుల్లో మందార పువ్వుల మొక్కలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి.

4 / 8
మందార పువ్వులను ఇంట్లో నాటడం వల్ల సానుకూలత వస్తుంది. అయితే ఈ మందారం మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి. మొక్క ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మందారం పువ్వు సంపద దేవత లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని నమ్మకం. కనుక ఎవరి ఇంట్లో మందారం మొక్క ఉంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

5 / 8

చిన్న చిన్న కారణాల వల్ల ఇంట్లో చాలా సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వివాదాలు భార్యాభర్తల మధ్య సంబంధాలపై కూడా చాలా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు సంబంధాలు బీట పడతాయి కూడా.. సంబంధాలను బలోపేతం చేయడంలో మందారం పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

6 / 8
ఆర్ధిక సమస్యలున్నవారికి మంచి నివారణ మందారం పువ్వు. ఆర్ధిక సమస్య నుంచి బయటపడటానికి శుక్రవారం రోజున డబ్బును ఉంచే సురక్షితమైన స్థలంలో లేదా డబ్బులు ఉంచే ప్లేస్ లో పువ్వులు పెట్టాలి. ఈ మందరం పువ్వులు పెట్టే ముందు గణేశుడిని, దుర్గాదేవిని ధ్యానించడం మర్చిపోకూడదు. ఈ రెమెడీని వరుసగా 7 శుక్రవారాలు చేయాలి.

7 / 8
ఇంట్లో డబ్బులకు ఇబ్బంది కలుగుతుంటే ఎంత కష్టపడినా ఫలితం లేకుంటే మందారం పువ్వు నివారణను పాటించాలి. రాగి గిన్నెలో నీరు వేసి మందారం పువ్వులను పువ్వులను ఉంచండి. ఆ తర్వాత సూర్యదేవునికి ఆ నీటితో అర్ఘ్యాన్ని , నైవేద్యాన్ని సమర్పించండి.

8 / 8
వ్యాపారంలో రాణించక పోయినా..  కష్టపడి పని చేస్తున్నా పనిలో పురోగతి లేకపోయినా మందారం పువ్వు ఈ సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. మందార పువ్వులతో పాటు పంచదార మిఠాయిని లక్ష్మీదేవికి సమర్పించాలి. మందార పువ్వును దుర్గాదేవికి, లక్ష్మీదేవికి , హనుమంతుడికి సమర్పించాలి. మంగళ దోషాన్ని తొలగిస్తుంది. డబ్బుకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.