2026 జనవరిలో ముఖ్యమైన పండుగలు, తేదీలు ఇవే!

Updated on: Jan 06, 2026 | 3:28 PM

2026 వస్తూనే జనవరి నెల మొత్తం కొత్త ఉత్సాహం ఉండేలా చేస్తుంది. ఎందుకంటే సంవత్సరంలోని మొదటి నెలలో అనేక పండుగలు ఉంటాయి. అలాగే హిందూ మతంలో సంవత్సరంలోని మొదటి నెల అపారమైన శక్తిని కలిగి ఉంటుందని చెబుతారు పండితులు. ఈ నెలలో ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అన్నింటికీ అనుకూలమైన నెల జనవరి నెల. ఇక ఈ జనవరి నెలలో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. కాగా,వాటి తేదీలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
జనవరి నెలల్లో వచ్చే ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి. హిందువులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో జనవరి 14న మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.  ఈరోజు సూర్య భగవానుడిని పూజించి, ఆయనకు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. అదే విధంగా ఈ రోజు షట్టిల ఏకాదశిని కూడా జరుపుకుంటారు. ఈరోజు  విష్ణువుకు తులసిని సమర్పించి, ప్రత్యేక పూజలు చేస్తారు.

2 / 5
సంకట చతుర్థి : హిందువులందరూ జనవరి 6,2026లో సంకట చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున చంద్రోదయం తర్వాత నెయ్యి దీపాన్ని వెలిగించి, గణేశుడిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు, ఒత్తిడి తగ్గిపోయి, కెరీర్ పరంగా సక్సెస్ అవుతారంట. అందుకే జనవరి నెలలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది.

3 / 5
అదే విధంగా 2026 జనవరి 16న మాసిక్ శివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివ భక్తులు అందరూ శివాలయాలకు వెళ్లి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజున రాత్రి పూట చంద్రుడికి నీటిని సమర్పించి, కొన్ని నిమిషాలపాటు మౌనంగా కూర్చొంటారు. దీన వలన భావోద్వేగ విముక్తి లభిస్తుందంట. అలాగే చంద్రుడికి నీటిని అర్పించడం వలన ప్రశాంతత లభిస్తుంది.

4 / 5
2026 సంవత్సరంలో జనవరి 18వ తేదీన మౌని అమావాస్య. అన్ని అమావాస్యల్లో కెళ్లా ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ప్రజలు అందరూ పవిత్ర నది స్నానం ఆచరించి, సూర్య భగవానుడిని పూజిస్తారు. అంతే కాకుండా, కొన్ని ప్రత్యేక పూజలు చేయడం, పిత తర్పణాలు చేయడం చేస్తుంటారు.

5 / 5
అలాగే 2026 సంవత్సరంలో జనవరి 23వ తేదీన వసంత పంచమి. ఈరోజు సరస్వతి దేవికి పువ్వులు, స్వీట్స్ సమర్పించి, పూజలు చేయడం, అక్షరాభ్యాసం, వంటివి చేస్తుంటారు. అలాగే జనవరి 29 వ తేదీన జయ ఏకాదశి పండుగ. ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో ధాన్యం, వస్త్రా దానం చేస్తారు. దీని వలన గత కర్మల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.