
మేషం: ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారు తప్పకుండా ధనవంతులవుతారు. ఆర్థికంగా బాగా బలపడతారు. కుటుంబ జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు జీతభత్యాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరుగుదలకు సంబంధించి వీరికి అన్ని శుభాలే కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా సంపద పరంగా బాగా పురోగమిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇది బాగా అనుకూల సమయం.

వృషభం: ఈ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయం విషయంలో పట్టపగ్గాలు ఉండవు. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి, రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలో అంద లాలు ఎక్కడంతో పాటు ఆదాయపరంగా బాగా అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి లాభాలు బాగా పెరుగుతాయి. మీ ప్రతిభతో, నైపుణ్యాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు.

కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ దేవ గురువు ఆశీస్సులు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఈ మూడు నెలల కాలంలో ఈ రాశివారి సంపద అపారంగా వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక, రుణ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభి స్తుంది. ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయి. భారీ జీతభత్యాలతో కూడిన కొత్త అవకాశాలు కూడా అంది వస్తాయి. అనేక విధాలైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరగడంతో పాటు, ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తులు చేజిక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఒకటి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. తండ్రి వైపు నుంచి ఊహించని సంపద కలిసి వస్తుంది.

వృశ్చికం: ఈ రాశిని సప్తమ స్థానంలో ఉన్న గురువు పూర్ణ దృష్టితో చూస్తున్నందువల్ల ఆర్థికంగా బలో పేతమవుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే పక్షంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. మూడు నెలల్లో తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి, రుణ బాధల నుంచి పూర్తిగా బయటప డడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి కూడా ధనయోగాలు పట్టే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు లాభ స్థానాన్ని చూస్తున్నందువల్ల ఈ రాశివారు ధన పరంగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకు జీతభత్యాలు అంచనాలకు మించి పెరు గుతాయి. భారీగా జీతభత్యాలనిచ్చే ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ సంపాదన అనుభవించే అవకాశం కూడా ఉంది. ఆర్థిక సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు లభిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది.