12 / 13
కుంభ రాశి: ఇంటి విషయంలో ఈ రాశి వారు మరికొద్ది కాలం నిరీక్షించడం మంచిది. గృహ యోగానికి గ్రహ సంచారం ఆశించినంతగా అనుకూలంగా లేదు. వచ్చే ఏడాది జూలై వరకు ప్రయత్నం చేయక పోవడం మంచిది. ఈ ఏడాది గృహ ప్రయత్నం చేయడం వల్ల ఆర్థిక నష్టం, అశాంతి, అసంతృప్తి వంటివి అనుభవానికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటి కోసం ప్రయత్నించడంలో శ్రమ, తిప్పట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఎవరి కారణంగానో మోసపోయే అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని కారణంగా గృహ ప్రయ త్నాలు మందకొడిగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది.