
ఫిబ్రవరి నెలలో కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, కుజ గ్రహాలు సంయోగం చెందనున్నాయి. దీని వలన చతుర్గృహి రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని ఇవ్వనున్నదంట.

వృషభ రాశి : వృషభ రాశి వారికి చతుర్గృహి రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ నెల మొత్తం చాలా ఆనదంగా గడుపుతారు.

మిథున రాశి : మిథున రాశి వారికి ఫ్రిబవరి నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరు అయితే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటారో వారికి బాగుటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్గృహి రాజయోగం వలన కుంభరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అలాగే ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం మార్పు కోరుకుంటున్నారో, వారికి ఇది మంచి సయమం. ఆకస్మిక ప్రయాణాలు అత్యధిక లాభాలను తీసుకొస్తాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలిగిపోయి, ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.