Ganesha Statue: 3 వేల అడుగుల ఎత్తులో శిఖరం అంచున వెలసిన బొజ్జ గణపయ్య.. ప్రయాణం ఓ సాహసమే..

| Edited By: TV9 Telugu

Aug 22, 2024 | 1:16 PM

భారతదేశ వ్యాప్తంగా గణేష్ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మేము మీకు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గణేశుడి విగ్రహం గురించి తెలియజేనున్నాం. ఇక్కడ గణేశుడు శిఖరంపై కొలువై ఉన్నాడు. కనుక ఈ స్థానం చాలా ప్రత్యేకమైనది.

1 / 5
 భారతదేశంలోని ఓ పర్వత శిఖరంపై గణేశుడి విగ్రహం ఉంది. ఇక్కడ గణపతి కొలువై ఉందని పురాణాలలో ఓ కథ ఉంది.  పరశురాముడికి, గణపతికి బంధుత్వం ఉందని చెబుతారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మీరు విభిన్నమైన రీతిలో గణపతిని దర్శించుకోవాలనుకుంటే, మీరు ఖచ్చితంగా ఈ గణపతిని దర్శనం లిస్ట్ లో చేర్చుకోండి.

2 / 5
 ఈ గణపతి విగ్రహాన్ని ధోల్కల్ గణేష్ అని పిలుస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఉంది. బస్తర్‌లోని దంతేవాడ జిల్లాలోని ఫరస్‌పాల్ గ్రామం, బైలాడిలా కొండపై వెలిశాడు బొయ్య గణపయ్య

3 / 5
 ఈ చారిత్రాత్మక గణపతి విగ్రహం సుమారు 3000 అడుగుల ఎత్తులో స్థాపించబడింది. 3 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని శిఖరం అంచున ఎలా ఏర్పాటు చేశారనేది నేటికీ రహస్యంగానే ఉంది

4 / 5
 ఈ విగ్రహానికి స్థలానికి చెందిన ఓ కథ పురాణాల్లో ఉంది. ఈ ప్రదేశంలో పరశురాముడు, గణేశుడు పోట్లాడుకున్నారని, ఈ ప్రదేశంలో గణేశుడి దంతం విరిగి పడిందని నమ్మకం. ఇక్కడ గణపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు శిఖరానికి చేరుకుంటారు.

5 / 5
 ఇక్కడ ఉన్న గణేశుడు అక్షతలు, విరిగిన దంతాలు, పూలమాలలు, మోదకాలు పట్టుకుని ఉన్నాడు. 2012 సంవత్సరంలో, ఈ విగ్రహం  చిత్రం వైరల్ అయ్యింది. నేడు ఇది ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నప్పటికీ,  గణపతి దర్శనం చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు భక్తులు