AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: అరుదైన గజకేసరి యోగం.. త్వరలో ఈ రాశుల దశ తిరగడం ఖాయం!

గురు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడే గజకేసరి యోగం ఒక్కో రాశిలో ఒక్కో విధంగా ఫలితాలనిస్తుంది. ఈ యోగం వల్ల కలిగే శుభ ఫలితాలు శత్రు జయం, సమస్యల పరిష్కారం, ఆదాయ వృద్ధి, పదోన్నతులు, రాజపూజ్యాలు. అయితే, బుధ గ్రహానికి చెందిన మిథున రాశిలో ఈ నెల(డిసెంబర్) 5, 6, 7 తేదీల్లో చోటు చేసుకుంటున్న గజకేసరి యోగం వల్ల అదనంగా విదేశీ సంపాదన యోగం, పెళ్లి యోగం, సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారి జీవితాలు సరికొత్త మలుపు తిరగడం జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 03, 2025 | 5:29 PM

Share
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురు, చంద్రులు కలుసుకోవడంవల్ల ఈ రాశివారికి అతి తక్కువ శ్రమ లేదా ప్రయత్నంతో అత్యధికంగా ధనాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ‘ఈజీ మనీ’కి బాగా అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తేలికగా రాబడి పెరుగుతుంది. యాక్టివిటీలో జోరు పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశిలో గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల రాజపూజ్యాల కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. గృహ, వాహనయోగాలు కలిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి. రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. విదేశీ ఆఫర్లు అందుతాయి.

2 / 6
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు చంద్రుల కలయిక వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో గరిష్ఠంగా లాభాలు పొందడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు చేసే ప్రయత్నాలు వంద శాతం సక్సెస్ అవుతాయి. ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది.

3 / 6
తుల: ఈ రాశికి భాగ్యస్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందు వల్ల ఈ రాశివారికి త్వరలో తప్ప కుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలగవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. పిల్లలు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి అధిపతి గురువే అయినందువల్ల ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఏర్పడిన గజకేసరి యోగం అనేక విధాలుగా అదృష్టాన్ని కలిగిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా బాగా లాభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికారయోగం పడుతుంది.

5 / 6
మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువుకు, చంద్రుడికి యుతి జరగడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తిపాస్తులు లభిస్తాయి.

6 / 6