- Telugu News Photo Gallery Spiritual photos Elinati shani effect on these three zodiac signs will face financial and health problems in 2026
మళ్లీ కష్టాలు మొదలు.. 2026లో కూడా వీరిని వదిలి పెట్టని శని.. ఇక అన్నీ సమస్యలే!
ఏలినాటి శని ప్రభావం వలన 2026లో కొన్ని రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కొత్త సంవత్సరంలో శని తన రాశిని మార్చడు, జూలై నుంచి శని మార్గి(తిరోగమనం, వక్రమార్గం)లో సంచరిస్తాడు. దీంతో ఏలి నాటి శని రెండో దశ, చివరిదశ 2026లో కూడా కొనసాగుతుందంట. దీని వలన మూడు రాశుల వారికి సమస్యలు తప్పవు అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 03, 2025 | 5:06 PM

ఏలినాటి శని ప్రభావం రాశులపై చాల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన ఆర్థిక నష్టం, అనుకోని ఆపదలు రావడం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం దశలు మారే కొద్ది దీని ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంటుంది. మొదటి దశలో ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రెండో దశలో ఉద్యోగంలో సవాళ్లు ఎదుర్కోవడం, ఆర్థిక పరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మూడో దశలో శని చేసే కర్మలను బట్టీ ఫలితాలను ఇస్తుంటాడు. కాగా, 2026 సంవత్సరంలో కూడా శని మూడు రాశుల వారిపై తన ప్రభావం చూపనున్నాడంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలి నాటి శని చిరి దశక కొనసాగుతుంది. ఇది 2026లో కూడా ఈ రాశి వారిపై దీని ప్రభావం ఉండనున్నది. ఏలి నాటి శని ప్రభావం వలన కుంభ రాశి వారు 2026 సంవత్సరంలో అలసట, ఆర్థిక నష్టం, వృత్తిపరమైన రంగాల్లో ఆరోగ్య సవాళ్లను సూచిస్తుంది.

మీన రాశి : మీన రాశి వారిపై 2026లో ఏలి నాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుంది. ఈ సమయంలో వీరు అనేక ఆర్థిక నష్టాలు చవి చూస్తారు. అలాగే వీరికి కెరీర్ పరంగా, సంబంధాల పరంగా కూడా అనేక ఎదురు దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది.

మేష రాశి : మేష రాశి వారికి 2026లో ఏలి నాటి శని ప్రభావం మూడో దశ కొనసాగుతుంది. దీని వలన వీరు ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది మంచిది కాదు, అలాగే, కుటుంబంలో వివాదాలు పెరిగే ఛాన్స్ ఉంది, ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.