
లక్ష్మి దేవి పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే నివసిస్తుందని నమ్ముతారు. కనుక శుక్రవారం ఇంటి ముందు ముగ్గులు వేసి.. ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసి లక్ష్మిదేవిని పూజించాలి.

లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టిందని హిందువులు నమ్ముతారు. కనుక ఆమె తెలుపు రంగును ఇష్టపడుతుంది. అందుకనే శుక్రవారాల్లో తెల్లని వస్త్రాలు ధరించడమే కాదు అమ్మవారి అనుగ్రహం కోసం పాలతో చేసిన ఆహారం అత్యంత శ్రేష్ఠం.

లక్ష్మీదేవికి కుంకుమపువ్వుని లేదా బియ్యంతో పాయసం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం సాధ్యం కాకపోతే మఖానా లేదా పాలు, శ్రీ ఫలాన్ని సమర్పించవచ్చు.

తులసి మొక్కని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. నిబంధనల ప్రకారం శుక్రవారం రోజున తులసి మొక్కను, శాలిగ్రామాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషించి, కోరుకున్న వరాన్ని ఇస్తుంది. తులసి మొక్క దగ్గర ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి.

శుక్రవారం రోజున స్త్రీల తప్పక కుంకుమ, పాదాలకు పసుపు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. సంపద-సమృద్ధితో నిరంతరం అదృష్టాన్ని పొందుతారు.

ఏ స్త్రీతోనూ అసభ్యకరంగా మాట్లాడకూడదు. అదే సమయంలో పిల్లలు, వృద్ధుల హృదయాన్ని గాయపరచవద్దు. ఇలా చేసే వారి పట్ల లక్ష్మీ దేవి అసంతృప్తి చెందుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు కష్టాలు అనుభవిస్తారని నమ్మకం. ఈ రోజున భగవంతుని లక్ష్మీనారాయణ రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.