Mars Effect: కుజ గ్రహానికి బలం.. ఆ రాశుల వారికి అనూహ్య నష్టాలు, సమస్యలు..!

Edited By:

Updated on: Jan 24, 2026 | 5:16 PM

Exalted Mars in Capricorn: మకర రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న కుజ గ్రహం వల్ల ఫిబ్రవరి 23 వరకు కొన్ని రాశులవారు కష్ట నష్టాలను అనుభవించే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, అనారోగ్య సమస్యలు, పోట్లాటలు, విషాహారం, మోసాలు, దుర్వార్తా శ్రవణం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. కుజుడు దుస్థానాల్లో ఉన్నవారు ఇటువంటి విషయాలకు సిద్దపడి ఉండడం మంచిది. మిథునం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి సుమారు నెల రోజుల పాటు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ రాశుల వారు ఎక్కువగా స్కంద స్తోత్రం పఠించడం మంచిది.

1 / 6
మిథునం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారు వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. సొంత వాహనాలను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. ఆహార, విహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆహార సమస్య వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడానికి, మోసపోవడానికి అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్పడి ఉన్నత స్థాయి స్థితిగతులు ఏర్పడే అవకాశం ఉంది కానీ, వాహన ప్రమాదాల వల్ల ఇబ్బంది పడే సూచనలు కూడా ఉన్నాయి. సొంత వాహనాల్లో ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వాద వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా పోట్లాటలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ నుంచి ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది.

3 / 6
సింహం: ఈ రాశికి షష్ట స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాశివారు ఇతరుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడడానికి బాగా అవకాశం ఉంది. గాయపడే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ షాక్ విషయంలోనే కాక, అగ్ని ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగా నష్టపోవడం గానీ, మోసపోవడం గానీ జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

4 / 6
కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారు ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపా రాల్లో కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉంది. పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో నష్టపోవడానికి బాగా అవకాశం ఉంది. పిల్లలకు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. గర్భస్రావాల వంటివి జరగవచ్చు. సరైన ఆహారం భుజించకపోవడం, చెడిపోయిన ఆహారం భుజించడం వంటి వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మిత్రుల వల్ల నష్టపోవడం జరుగుతుంది.

5 / 6
మకరం: ఈ రాశిలో ఉచ్ఛ కుజుడి సంచారం వల్ల ఈ రాశివారికి రుచక మహా పురుష యోగం ఏర్పడుతున్నప్పటికీ, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బాగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ధనపరంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. బాగా సన్నిహితుల వల్ల భారీగా మోసపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

6 / 6
కుంభం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారు దూర ప్రాంతానికి బదిలీ అయి అవస్థలు పడే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల కష్టనష్టాలకు గురి కావడం జరుగుతుంది. భారీగా ధన నష్టానికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. విద్యుదాఘాతం, విషాహారం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. వైద్య ఖర్చులు బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా తప్పటడుగులు వేసే అవకాశం ఉంది.