
మనం పెద్దలను పలకరించేటప్పుడు, వారికి నమస్కారం చేసినప్పుడు వారిచ్చే ఆశీర్వచనాలు మంచి ఫలితాలను ఇస్తాయి అంటారు. కానీ ఎవరు అయినా సరే పెద్దలను వినయంతో పలకరించి, నమస్కారం చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయంట. కాగా, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

విష్ణువుకు, విష్ణు భక్తులకు నమస్కారం చేసే సమయంలో, శివుడికి నమస్కారం చేసే సమయంలో తప్పకుండా కొన్ని ప్రత్యేక విధానాలు అనుసరిచాలంట. రెండు చేతులను జోడించి, తలపై పన్నెండు అంగుళాల ఎత్తులో పట్టుకొని, భక్తి వినయంతో , మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా నమస్కారం చేసినప్పుడు, మంచి ప్రయోజనాలు కలుగుతాయంట.

అదే విధంగా ఎప్పుడైనా మీకు మీ గురువులు కనిపించినప్పుడు నోటితో నమస్కారం అని చెప్పకూడదంట. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలానే చేస్తున్నారు. గురువుకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను ముడుచుకొని వినయంగా నమస్కరించాలంట. ఇది మీకు శుభఫలితాలను ఇస్తుంది. ముక్కుమై మీ చేతి వేళ్లు ఉండేలా నమస్కారం చేయాలంట, ఇది మీ గురువుకు రుణం తీర్చుకోవడానికి సహాయపడుతుంది.

అదే విధంగా తల్లిదండ్రులకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను నోటికి దగ్గరగా ఉంచి, నమస్కారం చేయాలంట. తల్లికి మాత్రం సాష్టాంగ నమస్కారం లేదా గుండెపై చేతి వేసుకొని నమస్కారం చేయడం మంచిది. ఇది అత్యంత శ్రేష్టమైనదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అలాగే మహాపురుషులకు, యోగులకు, సాధవులకు లేదా మహాయోగులకు నమస్కారం చేసే సమయంలో రెండు చేతులను ఛాతిపై ఉంచి, తలను వంచి నమస్కారం చేయాలంట, ఇది చాలా శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు .( నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)