
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇక కొంత మందికి రాత్రి సమయంలో ఎక్కువగా కలలు వస్తే, కొందరికి ఉదయం పూట, మరికొంత మంది మధ్యహ్నం కునుకు తీసే సమయంలో కలలు వస్తుంటాయి. ఇక ఈ కలలు అనేవి అనేక రకాలుగా వస్తుంటాయి. కొందరికి పూర్వీకులు కనిపిస్తే మరికొంత మంది చెట్లు పుట్టలు కనిపిస్తుంటాయి.

ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కొంత మందికి ముందుగా జరిగే సంఘటనలు కలల రూపంలో కనిపిస్తాయి అంటారు. కానీ దీనిని కొంత మంది నమ్మితే, మరికొంత మంది మూఢనమ్మకం అని కొట్టి వేస్తారు. కానీ కొందరు కలలు ఎక్కువగా నమ్ముతారు. తమకు వచ్చిన కలలు నిజం అయ్యాయి అని చెబుతుంటారు. ఇక ఈ కలల్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి, శుభకరమైన కలలు, అశుభకరమైన కలలు. అయితే ఇప్పుడు మనం కలలో మంగళసూత్రం పెరిగినట్లు కలలు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

స్వప్నశాస్త్ర నిపుణులు కలలో మంగళ సూత్రం చూడటం చాలా మంచిది. ఇది భర్త దీర్ఘాయువును, భర్త ఆనందాన్ని సూచిస్తుంది. అయితే కలలో తాళి తెగడం కానీ, విరగడం కానీ అస్సలే మంచిది కాదు, ఇది అశుభకరం అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.

వివాహిత స్త్రీల కలలో మంగళ సూత్రం తెగినట్లు లేదా విరిగినట్లు, లేదా తీసి మళ్లీ మెడలో వేసుకున్నట్లు కనిపించడం మంచిది కాదంట. ఇది భర్త ఎదుర్కునే సమస్యలను సూచిస్తుందంట. కలలో మంగళ సూత్రం విరగడం అనేది, భర్త ఏదైనా సమస్యల్లో చిక్కుకోవడం, భర్త ఎదుర్కునే ఒత్తిడిని సూచిస్తుందని చెబుతున్నారు పండితులు.

అయితే ఎవరికి అయితే కలలో మంగళసూత్రం విరగడం లేదా తీసివేసినట్లు కల వస్తుందో వారు పరమశివుడుని ఆరాధించాలంట. భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేయాలని చెబుతున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.