- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2025: buy these things on deepavali day to welcome goddess lakshmi devi and bring prosperity
Diwali 2025: దీపావళి నాడు ఈ వస్తువులు కొనండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో దీపావళి ఒకటి. ప్రతి సంవత్సరంఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటారు. సనాతన ధర్మంలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసం ప్రకారం ఈ రోజున దీపాలు వెలిగించడమే కాదు లక్ష్మీదేవిని, గణేశుడిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
Updated on: Oct 09, 2025 | 7:43 AM

దీపావళి అంటే వెలుగుల పండుగ. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ పండగ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీపావళి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి , గణేశునికి కలిపి ప్రత్యేక పూజలు చేస్తారు. మత విశ్వాసం ప్రకారం ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అపారమైన సంపద.. ఆనందం, అలాగే శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. అయితే దీపావళి పండగ సందర్భంలో షాపింగ్ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపావళికి కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆ వస్తువుల రాకతో లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. మీరు కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలనుకుంటే.. ఈ రోజు చెప్పిన వస్తువులను కొని దీపావళి రోజున ఇంటికి తీసుకురండి. ఇలా చేయడం శుభ ఫలితాలను తెస్తుంది.

2025 దీపావళి ఎప్పుడంటే వేద క్యాలెండర్ ప్రకారం దీపావళిని ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న జరుపుకోనున్నారు.

దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలను పూజించడం ఆచారం. సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోయి ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయి. కనుక దీపావళి రోజున లక్ష్మీ-గణేశ విగ్రహాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున లక్ష్మీ-గణేశ విగ్రహాలను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

దీపావళి నాడు ఏమి కొనాలంటే మత విశ్వాసం ప్రకారం చీపురు సంపద దేవత అయిన లక్ష్మీదేవితో ముడిపడి ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశాలలో నివసిస్తుంది. చీపురుతో శుభ్రపరచడం జరుగుతుంది. అందువల్ల దీపావళి రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల శాంతి, ఆనందం, అలాగే సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు. కనుక ఈ దీపావళికి చీపురు కొనడం మర్చిపోవద్దు.

దీపావళి నాడు దీపాలు వెలిగించడం ఆచారం. ఇలా దీపాలు వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కనుక దీపావళి నాడు మట్టి దీపాలను కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదం. మత విశ్వాసం ప్రకారం, దీపావళి నాడు దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అమ్మ ఆశీస్సులతో అన్ని కోరికలు నెరవేరుతాయి.

అదనంగా దీపావళి నాడు కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ సేఫ్ ఎల్లప్పుడూ ఖాళీ అన్న మాటే లేకుండా చేస్తుంది.( ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)




