
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు అందంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలకు ముక్కోటి దేవతలతో పాటు..భక్త కోటి కూడా ఏడుకొండలకు చేరుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు..రోజుకో రూపం..పూటకో వాహన సేవతో భక్తులను అనుగ్రహిస్తారు తిరుమల వెంకన్న

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జగన్‌కు ఆలయ ప్రధాన అర్చకులు పరివట్టం కట్టారు. బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్...ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

ఎట్టకేలకు టీటీడీ ఉద్యోగుల సాకారమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నందుకు తిరుపతి తిరుమల పర్యటన వచ్చిన సీఎం జగన్ టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. తిరుపతి స్మార్ట్ సిటీ టిటిడి సంయుక్తంగా రూ. 684 కోట్లతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో హాస్టల్ బ్లాక్‌ల ప్రారంభించిన సీఎం జగన్ టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల నాటి కల నెరవేర్చారు.

చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చొరవ తో సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం తో టీటీడీ ఉద్యోగులు కృతజ్ఞతలు చెప్పారు.

రూ. 37.80 కోట్లతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులుండగా ఇందులో 750 మంది విద్యార్థులు బస చేసే అవకాశం ఉంది.

టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ చేసిన సీఎం వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు.

ఏడు కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ ఫ్లై ఓవర్..శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బాగా ఉపయోగపడుతుందన్నారు జగన్. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన హాస్టల్స్ ప్రారంభించారు ముఖ్యమంత్రి. తర్వాత తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకున్నారు.