Brahmotsavas: చిన్నశేష వాహ‌నంపై మ‌ల‌య‌ప్పస్వామి.. దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సు లభిస్తుందని నమ్మకం

|

Oct 08, 2021 | 8:39 PM

Chinna vahana Sesha Vahana Seva: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోవిడ్ 19 కార‌ణంగా ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో స్వామివారి వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. స్వామివారు ఈరోజు సాయంత్రం హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

1 / 6
శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం ఉద‌యం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, పిల్లన‌గ్రోవి ధ‌రించి గీతా కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

2 / 6
చిన్నశేష వాహ‌నంపై గీతా కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామి

3 / 6
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి.. నాగ‌లోకానికి రాజుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

4 / 6
శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై స్వామివారు ద‌ర్శన‌మిచ్చారు.

5 / 6
శ్రీ‌వారి ఆల‌యంలో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా న‌మూనా బ్రహ్మర‌థం, వృష‌భ‌, అశ్వ, ఏనుగులు నిలుస్తున్నాయి.

6 / 6
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.