తుల: సప్తమంలో గురు సంచారం, పంచమంలో పంచమాధిపతి సంచారం ఈ రాశివారికి అనుకూలంగా ఉన్నాయి. పిల్లల మీద ఈ రాశివారు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. పిల్లలు ఉన్నత విద్యకు వెళ్లడం, ఇష్టపడిన కోర్సులో చేరడం, మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించడం, వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడడం, మంచి పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లికి విదేశీ కనెక్షన్ ఉండే సూచనలు కూడా ఉన్నాయి.