
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో సంచరిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు కలిసి సంచరిస్తే.. దానిని గ్రహ సంయోగం అంటారు. గ్రహాలు ఒకదానితో ఒకటి కలిసి నప్పుడు అది కొన్ని రాశుల అదృష్టాన్ని మారుస్తుంది. తొమ్మిది గ్రహాలలో కుజుడిని సంపద, సౌకర్యానికి దేవుడుగా పరిగణిస్తారు. ప్రేమ, సంబంధాలు, స్నేహాన్ని సూచించే గ్రహం శుక్రుడు అని అంటారు. సూర్యుడు ఆరోగ్యం, వృత్తి, ఆర్థిక వ్యవస్థ, శ్రేయస్సు కుటుంబ విషయాలలో మార్పులను తెస్తాడని నమ్ముతారు.

ఈ ఏడాది చివరిలో ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి. డిసెంబర్ 8న కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 18న సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి అంగారకుడితో కలుస్తాడు. డిసెంబర్ 20న చంద్రుడు.. డిసెంబర్ 21న శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా ధనుస్సు రాశిలో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. కుజుడు, సూర్యుడు, శుక్రుడు డిసెంబర్ 29 వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తారు. ఈ సమయంలో కొన్ని రాశుల జీవితం ప్రకాశవంతం అవుతుంది. కనుక చతుర్గ్రహి యోగం శుభ ప్రభావాలను అనుభవించే 4 రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ రాశి 6వ ఇంట్లో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల వృషభ రాశి వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి చతుర్గ్రహి యోగం చాలా శుభప్రదం. ఈ సమయంలో వీరి సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. కెరీర్ , వ్యాపారంలో గొప్ప విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. ఆఫీసులో, కుటుంబంలో వీరి మాటలకు విలువ లభిస్తుంది. వీరి సలహాలను వింటారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ యోగం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవితంలో వృద్ధి కనిపిస్తుంది. అంతేకాదు శారీరక , మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. శుక్రుని అనుగ్రహం కారణంగా.. వీరికి ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

మిథున రాశి: ఈ రాశి 7వ ఇంట్లో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. ఇది ఉద్యోగాభివృద్ధిని, వ్యాపారంలో పురోగతిని, వ్యవస్థాపకులకు విజయాన్ని తెస్తుంది. అలాగే ఈ యోగం ఏర్పడటంతో మిథున రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కెరీర్ రంగంలో పురోగతి లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో మరిన్ని లాభాలను పొందుతారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. మిథున రాశి వారికి చతుర్గ్రహి యోగం చాలా శుభప్రదం. ఉద్యోగులు తమ పనికి ప్రశంసలను పొందుతారు. కెరీర్ వృద్ధికి సరైన అవకాశాలను పొందుతారు. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనే కల నెరవేరవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి 8వ ఇంట్లో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్‌లో వివిధ అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో గణనీయమైన పెరుగుదల తెస్తుంది. ఈ సమయంలో భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్యలో ఎక్కువ ఏకాగ్రతతో .. విజయం సాధిస్తారు. ఈ యోగా ఫలితంగా వృశ్చిక రాశి వారు ఉద్యోగ రంగంలో మంచి పురోగతిని పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది. ఇది జీవితంలో ఆనందం , సౌకర్యాన్ని పెంచుతుంది. పెద్ద ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో విబేధాలు తొలగిపోతాయి. ప్రేమగా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశి మొదటి ఇంట్లో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ధనుస్సు రాశి వారి ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. ఈ సమయంలో ధనలక్ష్మి అనుగ్రహం వీరి సొంతం. ఈ సమయంలో వీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు. ఉన్నత స్థానం, ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. విద్యార్థులు విదేశాలలో సీటు పొందవచ్చు. ఈ సమయంలో స్టూడెంట్స్ శ్రద్దగా చదువుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తక్కువ శ్రమతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఎక్కువ జీతం, ఉన్నత స్థానం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. దీని కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా పని సకాలంలో పూర్తవుతుంది. ఈ కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.