
కోపంతో ఉన్న వ్యక్తులు: చాలా కోపంగా ఉన్న వ్యక్తులు తమపై ఎప్పుడూ నియంత్రణ కలిగి ఉండరు. క్షణికావేశంలో, వ్యసనానికి పాల్పడి పాపంలో పాలుపంచుకుంటారు. అలాంటివారు మరణానంతరం నరకయాతన అనుభవించాల్సి వస్తుంది.

దుష్టుడు- నీచుడు: దుష్ట ఆలోచనలు నీచమైన పనులు చేసే వ్యక్తులు నరకానికి అర్హులని, అలాంటి వ్యక్తులు ఇతరులను ఇబ్బంది పెడతారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఇతరులను బాధపెట్టే వారికి నరక ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుందని తెలిపాడు.

ప్రియమైన వారితో శత్రుత్వం: చాణక్యుడు ప్రకారం, తమ ప్రియమైన వారిని ద్వేషించి, వారిని బాధపెట్టే వ్యక్తులు కూడా నరకానికి అర్హులు.

జీవుల పట్ల చులకన భావం: నిరుపేదలను, జీవులను తక్కువ భావంతో చూసే వారు నరకానికి అర్హులని వారు జీవిస్తూనే నరకయాతన అనుభవించాల్సిందేనని.. నిరుపేదలను అసహ్యించుకునే వారికీ మరణానంతరం నరకానికి చేరుకుంటారని ఆచార్య చాణక్యుడు చెప్పారు.

సంపదను ప్రదర్శించండి: ఆచార్య చాణక్యుడు తన విధానాలలో ఒక వ్యక్తి తన సంపదను ఎప్పుడూ ప్రదర్శించకూడదని నొక్కి చెప్పాడు. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గోప్యత పాటించాలని ఎవరితోనూ పంచుకోకూడదని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల మీ డబ్బుపై ఇతరుల చెడు దృష్టి పడే అవకాశం ఉంది.