- Telugu News Photo Gallery Spiritual photos Ayodhya ram mandir started taking shape latest pictures surfaced
Rama Mandir: ఆధ్యాత్మిక ఉట్టిపడేలా రామాలయం.. లేటెస్ట్ ఫోటోలు రిలీజ్.. 3 విగ్రహాలు రెడీ.. ఒక్కదానికే గర్భగుడిలో కొలువయ్యే అదృష్టం..
హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి ఆలయం శర వేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. ఆలయంలోని కారిడార్లు, గోడలు, పైకప్పులపై చెక్కిన శిల్పాలతోనే ఆలయం నిర్మాణంలో దైవత్వం అంచనా వేస్తున్నారు భక్తులు. తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రామయ్య ఆలయ తాజా చిత్రాలను ట్వీట్ చేశారు.
Updated on: Jun 25, 2023 | 9:22 AM

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిర నిర్మాణం శర వేగంగా జరుగుతుంది. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఉంటుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. అయితే కోట్లాది హిందువుల కలైన రామ జన్మ భూమిలో రామయ్య ఆలయం ఎంత వైభవంగా ఉంటుందో, ఎంత దివ్యంగా ఉంటుందో అనే ఆసక్తి అనేక మందిలో ఉంది. భక్తుల ఆసక్తిని తీర్చేందుకు ఆలయ నిర్మాణానికి సంబంధించిన కొన్ని చిత్రాలు చూడండి.

ఈ చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాలలో, ఆలయానికి చెందిన అందమైన శిల్పాలతో ఆలయ వైభవాన్ని తెలియజేసే కారిడార్ , వరదారి చూపించబడ్డాయి. చిత్రాలలో కనిపించే ఆలయ కారిడార్లు, పైకప్పులలోని చెక్కడం ద్వారా ఆలయ వైభవాన్ని, దైవత్వాన్ని సులభంగా అంచనా వేయవచ్చు

రామయ్య ఆలయ నిర్మాణ చిత్రాలు అద్భుతంగా ఉండటమే కాకుండా, గోడలపై చెక్కబడిన కళాఖండాలు విశిష్టత, వాస్తుశిల్పానికి అత్యంత అందమైన ఉదాహరణలు అని పేర్కొన్నారు.

ఆలయ పైకప్పులోని చెక్కడాలు కూడా వేటికవే ప్రత్యేకమైనవి. సెప్టెంబరు 2023 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని.. ఆలయంలో మరిన్ని కిటికీలు, తలుపులు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. అంతేకాదు వచ్చే ఏడాది మకర సంక్రాంతి నాడు తన దివ్య గర్భగుడిలో రాముడుని ప్రతిష్టించనున్నామని చెప్పారు.

ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం దాదాపు సిద్ధమైంది. ఇప్పుడు మ్యాప్ ప్రకారం ప్రధాన ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు ఆలయంలోని రాళ్లపై వివిధ దేవుళ్ల విగ్రహాలను చెక్కే పనులు కూడా వేగంగా పూర్తవుతున్నాయి. ఈ పనులు పూర్తి చేసిన వెంటనే మొత్తం ఆలయానికి తుది మెరుగులు దిద్దనున్నారు.

ఈ ఏడాది చివరి నాటికి ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసేందుకు ఆలయ యాజమాన్యం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.వాస్తవానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రం, ఆలయ ప్రారంభోత్సవం, గర్భగుడిలో స్వామివారి ప్రాణప్రతిష్ఠ వంటి పనుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఉంది. అందుకోసమే రామజన్మభూమి కాంప్లెక్స్‌లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు చేస్తున్నారు.

పుణ్యక్షేత్రం అధికారులు స్వయంగా అర్థరాత్రి వరకు ఇక్కడే కూర్చొని నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. జనవరి 2024లో రామయ్యను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. అప్పటికి ఆలయంలో చేయాల్సిన పని ఒక్కటి కూడా ఉండకూడదు అనే లక్ష్యంతో నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రాంగణంలో మూడు రాముడి విగ్రహాలు చెక్కబడుతున్నాయి.

అయితే గర్భగుడిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే ట్రస్ట్ నుండి రెండు రోజుల క్రితం.. నిర్మాణంలో ఉన్న విగ్రహాలలో అత్యంత సజీవమైన విగ్రహాన్ని ఎంపిక జేసి గర్భగుడిలో ప్రతిష్టించనున్నట్లు చెప్పారు. మరోవైపు, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే అనువైన ప్రదేశంలో ప్రతిష్టించనున్నారు. ఈ మూడు విగ్రహాల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్ఠాపనకు స్థలాన్ని ఎంపిక చేస్తున్నారు.




