
భద్రతకు సంబంధిత సమస్యలను బహిర్గతం చేయవద్దు: ఒకరి భద్రతా సంబంధిత విధానాలు, ఒకరి కార్యకలాపాలు, రహస్య సమాచారం, రహస్య ఎజెండా, ఇతర సంబంధిత సమస్యలను ఇతరులకు వెల్లడించకూడదు. దీని కారణంగా వ్యక్తి భద్రత ప్రమాదంలో పడవచ్చు. ప్రత్యర్థులు మీ బలహీనతల నుంచి ప్రయోజనం పొందవచ్చు.

ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి చాలాసార్లు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడవద్దని సూచించారు. విజయాన్ని సాధించే సమయంలో అభ్యసన ప్రక్రియలో అపజయం కూడా ఒక భాగమని, జీవితంలో సరైన లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం కృషి చేయాలని చెప్పాడు చాణక్య.

వివాదాలను సునాయాసంగా పరిష్కరించుకోండి: ఏ ఇంట్లోనైనా గొడవలు సహజం. చర్చలు , రాజీ ద్వారా సంఘర్షణలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవడానికి క్షమాపణ చెప్పడం, సభ్యుల మధ్య అవగాహనకు ఉన్న విలువను బోధించండి.

సంపదను ప్రదర్శించండి: ఆచార్య చాణక్యుడు తన విధానాలలో ఒక వ్యక్తి తన సంపదను ఎప్పుడూ ప్రదర్శించకూడదని నొక్కి చెప్పాడు. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గోప్యత పాటించాలని ఎవరితోనూ పంచుకోకూడదని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల మీ డబ్బుపై ఇతరుల చెడు దృష్టి పడే అవకాశం ఉంది.

లక్ష్యం: ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని అందరితోనూ చెప్పకూడదు. ఇలా చేయడం ద్వారా ఎవరైనా చెడు దృష్టికి రావచ్చు లేదా మీ ప్రత్యర్థి మీ పనిలో అవాంఛనీయమైన అడ్డంకులను సృష్టించవచ్చు. అందుకే మీ లక్ష్యాలలో కొన్ని ఎల్లప్పుడూ ఇతరులకు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.