Chanakya Niti: ఈ పక్షులు, జంతువుల గుణాలు నేర్చుకోండి.. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది..

Updated on: Sep 05, 2025 | 4:26 PM

ఆచార్య చాణక్యుడు మనిషి విజయం కోసం కొన్ని నీతి శాస్త్రంలో అనేక నియమాలను చెప్పాడు. మానవులు విజయవంతం కావాలన్నా, స్వావలంబన పొందాలనుకున్నా కొన్ని జంతువుల అలవాట్లను తమ జీవితంలో అలవర్చుకోవాలని చాణక్య నీతి పేర్కొంది .ఈ లక్షణాలను స్వీకరించడం ద్వారా వ్యక్తులు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చని, జీవితాన్ని మరింత సమర్థవంతంగా నడిపించవచ్చని చెబుతుంది. ప్రతి మానవునికి ప్రయోజనకరంగా ఉండే ఆ ఐదు జంతువుల అలవాట్ల గురించి తెలుసుకుందాం.

1 / 8
ఆచార్య చాణక్య గొప్ప రాజకీయ నాయకుడే కాదు.. తత్వ వేత్త. తన జ్ఞానం, అనుభవం నుంచి జీవితంలోని వివిధ అంశాలపై ముఖ్యమైన విషయాలను చెప్పాడు. చాణక్య చెప్పిన విధానాలు విజయం, విధానం, ప్రవర్తన , జీవిత ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబిస్తాయి. మానవులు తమ జీవితాల్లో కొన్ని జంతువుల అలవాట్లను స్వీకరించాలని, తద్వారా అవి మరింత విజయవంతమై స్వావలంబన పొందవచ్చని చాణక్య నీతి కూడా పేర్కొంది. ప్రతి మానవునికి ప్రయోజనకరంగా ఉండే ఆ 5 జంతువుల అలవాట్ల గురించి తెలుసుకుందాం.

ఆచార్య చాణక్య గొప్ప రాజకీయ నాయకుడే కాదు.. తత్వ వేత్త. తన జ్ఞానం, అనుభవం నుంచి జీవితంలోని వివిధ అంశాలపై ముఖ్యమైన విషయాలను చెప్పాడు. చాణక్య చెప్పిన విధానాలు విజయం, విధానం, ప్రవర్తన , జీవిత ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబిస్తాయి. మానవులు తమ జీవితాల్లో కొన్ని జంతువుల అలవాట్లను స్వీకరించాలని, తద్వారా అవి మరింత విజయవంతమై స్వావలంబన పొందవచ్చని చాణక్య నీతి కూడా పేర్కొంది. ప్రతి మానవునికి ప్రయోజనకరంగా ఉండే ఆ 5 జంతువుల అలవాట్ల గురించి తెలుసుకుందాం.

2 / 8
సింహం లాంటి నిర్భయత, విశ్వాసం 
సింహం అడవికి రాజు. ఈ మృగరాజు తన బలం, విశ్వాసం ఆధారంగా అడివిని పాలిస్తుంది. చాణక్యుడి ప్రకారం ఏదైనా పని చేసేటప్పుడు పూర్తి నిర్భయత, విశ్వాసంతో ముందుకు సాగాలి.

సింహం లాంటి నిర్భయత, విశ్వాసం సింహం అడవికి రాజు. ఈ మృగరాజు తన బలం, విశ్వాసం ఆధారంగా అడివిని పాలిస్తుంది. చాణక్యుడి ప్రకారం ఏదైనా పని చేసేటప్పుడు పూర్తి నిర్భయత, విశ్వాసంతో ముందుకు సాగాలి.

3 / 8
కోడి పుంజులా క్రమశిక్షణ  
కోడి పుంజు ఎల్లప్పుడూ సమయం పట్ల స్పృహతో ఉంటుంది. తెల్లవారు జామునే నిద్ర లేచి తన పనిని ప్రారంభిస్తుంది. ఈ కోడి పుంజు మనకు క్రమశిక్షణ , సమయ నిర్వహణను నేర్పుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే.. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి క్రమశిక్షణను పాటించాలి.

కోడి పుంజులా క్రమశిక్షణ కోడి పుంజు ఎల్లప్పుడూ సమయం పట్ల స్పృహతో ఉంటుంది. తెల్లవారు జామునే నిద్ర లేచి తన పనిని ప్రారంభిస్తుంది. ఈ కోడి పుంజు మనకు క్రమశిక్షణ , సమయ నిర్వహణను నేర్పుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే.. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి క్రమశిక్షణను పాటించాలి.

4 / 8
కాకిలా కష్టపడి పనిచేసే గుణం 
చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదు. కాకి ఒంటరిగా ఆహారాన్ని సేకరించి కష్టపడి పనిచేయడానికి వెనుకాడనట్లే.. ఎవరైనా సరే తాము చేపట్టిన పనిని పూర్తి చేయడనికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే పూర్తి నమ్మకంతో ఎటువంటి భయం లేకుండా చేయాలి.

కాకిలా కష్టపడి పనిచేసే గుణం చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ కష్టపడి పనిచేయడానికి వెనుకాడకూడదు. కాకి ఒంటరిగా ఆహారాన్ని సేకరించి కష్టపడి పనిచేయడానికి వెనుకాడనట్లే.. ఎవరైనా సరే తాము చేపట్టిన పనిని పూర్తి చేయడనికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే పూర్తి నమ్మకంతో ఎటువంటి భయం లేకుండా చేయాలి.

5 / 8
కుక్కలా అప్రమత్తం
కుక్క తన యజమాని పట్ల విధేయంగా ఉండటమే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. చాలా తినగల శక్తి ఉన్నప్పటికీ, అది కొంచెం ఆహారంతో సంతృప్తి చెందుతుంది. జీవితంలో సంబంధాల పట్ల నిజాయితీగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని కుక్క మనకు బోధిస్తుంది.

కుక్కలా అప్రమత్తం కుక్క తన యజమాని పట్ల విధేయంగా ఉండటమే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. చాలా తినగల శక్తి ఉన్నప్పటికీ, అది కొంచెం ఆహారంతో సంతృప్తి చెందుతుంది. జీవితంలో సంబంధాల పట్ల నిజాయితీగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని కుక్క మనకు బోధిస్తుంది.

6 / 8
 కొంగలా ఏకాగ్రత
మానవుడు కూడా కొంగ లాగా దృష్టి కేంద్రీకరించి ఉండాలి. కొంగ వేటాడేటప్పుడు.. తన దృష్టి అంతా చేపలపైనే ఉంచుతుంది. అది తన ఎరను రెప్పపాటులో పట్టుకుంటుంది. అదేవిధంగా మనిషి కూడా తన లక్ష్యం వైపు చాలా దృష్టి కేంద్రీకరించి ఉండాలి. సమయం వచ్చిన వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి.

కొంగలా ఏకాగ్రత మానవుడు కూడా కొంగ లాగా దృష్టి కేంద్రీకరించి ఉండాలి. కొంగ వేటాడేటప్పుడు.. తన దృష్టి అంతా చేపలపైనే ఉంచుతుంది. అది తన ఎరను రెప్పపాటులో పట్టుకుంటుంది. అదేవిధంగా మనిషి కూడా తన లక్ష్యం వైపు చాలా దృష్టి కేంద్రీకరించి ఉండాలి. సమయం వచ్చిన వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి.

7 / 8

గాడిద నుంచి ఈ విషయాలు నేర్చుకోండి.. గాడిద ఎప్పుడూ సంతృప్తిగా ఉంటుంది. ఎంత అలసిపోయినప్పటికీ భారాన్ని మోస్తుంది. వేడి లేదా చలి గురించి ఆలోచించకుండా.. ఎప్పుడూ సంతృప్తిగా ఉంటుంది. ఈ మూడు విషయాలను గాడిద నుండి నేర్చుకోవాలి. ఈ లక్షణాలను అలవరుచుకున్న వ్యక్తి తన జీవితంలో ఎంత అలసిపోయినా పనులలో విజయం సాధిస్తాడు.

గాడిద నుంచి ఈ విషయాలు నేర్చుకోండి.. గాడిద ఎప్పుడూ సంతృప్తిగా ఉంటుంది. ఎంత అలసిపోయినప్పటికీ భారాన్ని మోస్తుంది. వేడి లేదా చలి గురించి ఆలోచించకుండా.. ఎప్పుడూ సంతృప్తిగా ఉంటుంది. ఈ మూడు విషయాలను గాడిద నుండి నేర్చుకోవాలి. ఈ లక్షణాలను అలవరుచుకున్న వ్యక్తి తన జీవితంలో ఎంత అలసిపోయినా పనులలో విజయం సాధిస్తాడు.

8 / 8
కోకిలలా తీయగా మాట్లాడడం
కోకిల తనది కాని రోజుల్లో మౌనంగా ఉంటుంది. తనదైన సమయం వచ్చినప్పుడు తీయగా మాట్లాడం ప్రారంభిస్తుంది. ఈ స్వరం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఎవరైనా సరే మాట్లాడినప్పుడల్లా తీయగా మాట్లాడండి. చేదుగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది .

కోకిలలా తీయగా మాట్లాడడం కోకిల తనది కాని రోజుల్లో మౌనంగా ఉంటుంది. తనదైన సమయం వచ్చినప్పుడు తీయగా మాట్లాడం ప్రారంభిస్తుంది. ఈ స్వరం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఎవరైనా సరే మాట్లాడినప్పుడల్లా తీయగా మాట్లాడండి. చేదుగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది .