- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti parents should keep these things in mind while upbringing their child
Chanakya Niti: పిల్లలకు మంచి మర్యాద తెలియాలంటే తల్లిదండ్రులు ఇలా పెంచాలంటున్న చాణక్య
ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ సంస్కారవంతంగా ఉండాలని, సమాజంలో ఎంతో పేరు సంపాదించాలని కోరుకుంటారు. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పిల్లల మంచి పెంపకానికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు.. ప్రతి తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం
Updated on: Mar 28, 2023 | 1:16 PM

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.


చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేసిన వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. దీనితో పాటు డబ్బు కూడా పెరుగుతుంది. అయితే తాము సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేసేవారు జీవితంలో చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు కూడా చెప్పాడు.




