
భారతదేశంలోని గొప్ప పండితుల్లోఆచార్య చాణక్యుడు ఒకరు. అధ్యాపకుడు, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, పండితుడు, వక్త, గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తి. మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తూ నీతి శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఆయన తెలిపిన విషయాలు నేటి యువత కూడా అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా చాణక్యుడు కొంత మందితో శత్రుత్వం ఎప్పుడూ తీచ్చుకోవద్దు అని చెప్పాడు.

జీవితంలో అందరూ అందరినీ సంతోషంగా ఉంచలేరు. ప్రతి ఒక్కరికీ అందరూ నచ్చాలని లేదు. అందుకనే కొంతమంది తమకు నచ్చని వారిని దూరంగా పెడతారు. ఈ దూరం క్రమంగా శత్రుత్వంగా మారడం చాలాసార్లు చూస్తూనే ఉంటారు. వేల సంవత్సరాల క్రితం ఆచార్య చాణక్యుడు 5 మంది వ్యక్తులను ఎప్పటికీ శత్రువులుగా చేసుకోకూడదని పేర్కొన్నాడు. ఇలాంటి వ్యక్తులతో శత్రుత్వం ఖరీదైనదిగా మారవచ్చు. జీవితంలోని శాంతి, సుఖం అంతరించిపోవచ్చని ఆయన అన్నారు.

మీ పొరుగువారే మీ సంతోషానికి, దుఃఖానికి అత్యంత సన్నిహిత సాక్షులు. మీ పొరుగువారితో మీ సంబంధాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకండి. ఇరుగు పొరుగు వ్యక్తులతో మీ సంబంధం చెడిపోతే.. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు.

అత్యంత సన్నిహితులతో అకస్మాత్తుగా వివాదం కలిగి.. శత్రుత్వం ఏర్పడవచ్చు. ఈ శత్రుత్వం కూడా ప్రమాదకరం. మనకు అత్యంత సన్నిహితులకు మన రహస్యాలు, బలహీనతలు తెలిసే అవకాశం ఉంది. కనుక అటువంటి వ్యక్తులు శత్రువులుగా మారితే..మనకు అతిపెద్ద ముప్పుగా మారవచ్చు.

ఎటువంటి కుటుంబంలో నైనా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం సహజమే. అయితే ఈ అభిప్రాయబేధాలను దూరం చేసుకోకపోతే.. ఒకరికొకరు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అప్పుడు జీవితం ఒత్తిడితో కూడుకున్నది కావొచ్చు. ఎందుకంటే కష్ట సమయాల్లో కుటుంబ మద్దతు గొప్ప బలం. కనక కుటుంబ సభ్యులను ఎప్పుడూ శత్రువులుగా చేసుకోవద్దు అని చాణక్య పేర్కొన్నాడు.

ఏ రంగంలోనైనా ప్రభావవంతమైన వ్యక్తితో శత్రుత్వం సామాజిక సమస్యలను పెంచుతుంది. వారి సహాయంతో క్లిష్ట సమయాల్లో అనేక సమస్యలను పరిష్కరించవచ్చు.

ఆఫీసులో సహోద్యోగితో శత్రుత్వం మీ వృత్తి జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ ప్రమోషన్లు, ప్రాజెక్టులు, ఇమేజ్ వంటి అనేక విషయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.