- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in Telugu: acharya chanakya says these types of ladies can affects happiness and peace of life
Chanakya Niti: ఈ మూడు లక్షణాలున్న స్త్రీలు.. కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తారంటున్న చాణక్య
Chanakya Niti: స్త్రీ యోగ్యత, గుణదోషాలు మొత్తం కుటుంబ భవిష్యత్తును నిర్దేశిస్తాయని అంటారు. ఒక స్త్రీ కోరుకుంటే, ఆమె తన ఇంటిని స్వర్గంగా మార్చుకుంటుంది. అదే ఆమె కోరుకుంటే తన ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. స్త్రీ ఇంటి పెద్ద మాత్రమే కాదు.. ఇంటి నిర్వహణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
Updated on: Sep 02, 2022 | 11:26 AM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

సమయం సందర్భం లేకుండా.. మెలికలు తిరుగుతూ మాట్లాడేవాళ్ళను మనం చూస్తూనే ఉంటాం.. మన చుట్టు పక్కల ఇలా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి మనసులో ఒకటి అనుకుంటారు.. బయటకు ఒకటి వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి అలాంటి వారికి వీలైనంత దూరం పాటించండి

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో సంపద, ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాడు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఆ వ్యక్తి వద్ద ఉండదని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు.

నెపం చూపడం మానుకోండి: ప్రేమలో ఎలాంటి నెపం ఉండకూడదు. ప్రేమను జీవిత భాగస్వామికి తెలియజెడానికి ఏకైక మార్గం.. స్వచ్ఛత అని చాణక్య చెప్పాడు. స్వార్ధం కంటే.. ప్రేమకు మనిషి లొంగిపోతాడు.

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.




