

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.

ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేసిన వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. దీనితో పాటు డబ్బు కూడా పెరుగుతుంది. అయితే తాము సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేసేవారు జీవితంలో చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు కూడా చెప్పాడు.