
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.

చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

అదృష్టం మీద ఆధారపడకుండా కష్టపడి పనిచేసే వ్యక్తికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు అనేది కలగదు. అంతే కాకుండా జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కష్టపడి పనిచేసే వారు త్వరగా విజయం సాధిస్తారని చాణక్యుడు నమ్మాడు.


విజయం సాధించాలనే అహంకారం లేదా తన దగ్గర డబ్బు ఎక్కువ అనే అహంభావం ఉన్న వారి వద్ద లక్ష్మీదేవి ఉండదు. చాణక్యుడి ప్రకారం డబ్బు ఉందనే అహంకారం మీలో ఉంటే.. మీ తెలివితేటలు భ్రష్టు పట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. డబ్బు తెచ్చిన అహంకారంతో ఉన్నవారు ఆ డబ్బుని పోగొట్టుకుని పేదవారు కావచ్చు.

ఆధునిక కాలంలో నేటి యువత తమ వృద్ధ తల్లిదండ్రుల గురించి తరచుగా సిగ్గుపడుతున్నారు. కాలక్రమేణా.. ప్రతి ఒక్కరి శరీరంలో వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఇదొక రోజు వృద్ధులు అవుతారు. అందుకే మీ పేరెంట్స్‌ని చూసి సిగ్గుపడడం కానీ.. వారిని మార్చుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించకండి. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించండి.