
హిందూ మతంలో పారిజాత పూలకు చాలా గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి చూడటానికి చాలా చిన్నగా తెలుపు, నారింజ రంగులో ఉంటాయి. ఇక ఈ పూలు శివుడికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందుకే చాలా మంది లక్ష్మీదేవికి, శివుడికి ఈ పూలు సమర్పిస్తుంటారు.

అయితే చాలా మంది ఇంటి వద్ద పారిజాతం మొక్కను పెంచుకుంటారు. అయితే ఇది ఇంటిలో ఉండటం వలన సానుకూల శక్తి ఇంటిలోకి ప్రవేశించడమే కాకుండా, ఆనందం, శ్రేయస్సు కలుగుతందని నమ్మకం. అందుకే పారిజాతం మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభ ప్రదం అని చెబుతున్నారు వాస్తు పండితులు.

కానీ ఈ పారిజాతం మొక్కను ఇంటిలో నాటే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలంట. అవి ఏవి అంటే. పారిజాతం మొక్కను ఎప్పుడూ కూడా సోమవారం, శుక్రవారం మాత్రమే ఇంటిలో నాటాలంట. దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుంది. ఇంటిలోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయంట.

పారిజాతం మొక్కను ఇంటిలోపల నాటుకోవడం వలన వాస్తు దోషాల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. చాలా మంది వాస్తు సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ మొక్కను తమ ఇంటిలో నాటుకోవడం వలన ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట.

ఎవరి ఇంటిలోనైతే ఈ పారిజాతం మొక్క ఉంటుందో, వారి ఇంటిలో సుఖసంతోషాలు విల్లి విరుస్తాయి. అంతే కాకుండా ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతున్నారు పండితులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)