జ్యోతిష శాస్త్రం ప్రకారం రవి పితృ కారకుడు. చంద్రుడు మాతృ కారకుడు. తొమ్మిదవ స్థానం తండ్రి స్థానం. నాలుగవ స్థానం తల్లి స్థానం. వీటి స్థితిగతులను బట్టి తల్లితండ్రుల్లో ఎవరితో సాన్నిహిత్యం ఉంటుందో తెలిసే అవకాశం ఉంటుంది. సాధారణంగా జాతక చక్రంలో ఈ రవి, చంద్రులు దుస్థానాలలో అంటే 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు తల్లితండ్రులతో సఖ్యత ఉండకపోవడం, విరోధం కలిగి ఉండడం వంటివి జరుగుతాయి. అంతేకాక, ప్రధానంగా వివిధ రాశుల వారు తల్లితండ్రులలో ఎవరితో ఎక్కువగా సాన్నిహిత్యం, ప్రేమ కలిగి ఉండారన్నది రాశులను బట్టి కూడా ఉంటుంది. రాశులను బట్టి వివిధ రాశుల వారు తల్లితండ్రులతో ఎలా ఉంటారన్నది ఇక్కడ పరిశీలిద్దాం. ఇవి స్థూలంగా చెప్పే ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులను బట్టి ఫలితాలు మారే ఉంటుంది.