
మేషం: రిస్కు తీసుకోవడానికి, సాహసాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ రాశివారు ఈ ఏడాది విదేశాల్లో ఉద్యోగాల మీదా, ఉద్యోగంలో పదోన్నతుల మీదా, వృత్తి, వ్యాపారాల్లో లాభాల మీదా బాగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీరు వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే జూలై లోగా తమ లక్ష్యాలను సాధించుకునే అవకాశం ఉంది. వీటితో పాటే ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరత్వం లభిస్తుంది.

వృషభం: పట్టువదలని విక్రమార్కులకు మారుపేరైన ఈ రాశివారిలో భౌతిక సుఖాల మీద ఆశ, కోరిక కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకు రావాలన్న తపన కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఒక పద్ధతి, వ్యూహం ప్రకారం ఆదాయ మార్గాలను పెంచుకోవడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఇతర లావాదేవీల ద్వారా కూడా విశేష ధనార్జన చేసి తమ లక్ష్యాలను ఈ ఏడాది చివరి లోపల నెరవేర్చుకోవడం జరుగుతుంది.

సింహం: సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు, అన్నిటా ముందుండాలన్న కోరిక ఎక్కు వగా ఉండే ఈ రాశివారు ఉద్యోగంలో అందలాలు ఎక్కడం మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. తానే స్వయంగా ఒక చిన్నపాటి కంపెనీని ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో, పలుకు బడి కలిగినవారితో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడంతో పాటు, సంపన్నుల జాబితాలో చేరా లన్న కోరికను కూడా అక్టోబర్ లోపల ఈ రాశివారు తప్పకుండా నెరవేర్చుకునే అవకాశం ఉంది.

తుల: ఈ రాశివారిలో సహజ వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ శ్రమతో అత్యధిక లాభాలను సంపాదించడం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావడానికి, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించడానికి వీరు నడుం బిగించే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే వ్యాపారాలను చేపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశివారిలో పట్టుదల, ఆత్మ విశ్వాసం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోరు. ఈ ఏడాది వీరికి అత్యధికంగా ఆదాయం వృద్ధి చేసుకోవాలనే తపన పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి వీరు చేయని ప్రయత్నమంటూ ఉండకపోవచ్చు. తమ పనితీరుతో అధికారులను మెప్పించడం వల్ల జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా అత్యధికంగా లాభపడడం జరుగుతుంది.

మకరం: సాధారణంగా ముందుగానే లక్ష్యాలను నిర్దేశించుకోవడం, పట్టుదలగా, క్రమశిక్షణగా ఆ లక్ష్యాలను సాధించుకోవడం మకర రాశివారికి సహజ గుణాలు. మార్చి 29 తర్వాత నుంచి ఈ రాశివారు కొత్త ఆర్థిక, ఉద్యోగ లక్ష్యాలతో ముందుకు వెడతారు. ఈ రాశివారు ఏ ప్రయత్నాన్నీ మధ్యలో విరమిం చుకోవడమన్నది జరగదు. ఆర్థికాభివృద్ధితో పాటు, కొత్త నైపుణ్యాలు, సరికొత్త ప్రతిభతో వీరు వృత్తి, ఉద్యోగాల్లో కూడా దూసుకుపోవడం జరుగుతుంది. నవంబర్ లోగా వీరు తమ లక్ష్యాలను సాధిస్తారు.