గోరువెచ్చని నీళ్లతో బెలూన్‌లా పొంగే లేయర్ చపాతీ.. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే రుచి
రోజూ రాత్రి పూట లేదా ఉదయం అల్పాహారంలో చాలామంది ఆరోగ్యం కోసం చపాతీలు తింటుంటారు. కానీ చపాతీలు కాల్చిన కాసేపటికే బిరుసెక్కిపోవడం లేదా రబ్బరులా సాగడం సహజంగా ఎదురయ్యే సమస్య. అయితే మైదా చుక్క కూడా వాడకుండా, అచ్చమైన గోధుమపిండితోనే రెస్టారెంట్లలో దొరికే లేయర్ పరోటాల మాదిరిగా పొరలు పొరలుగా, బెలూన్‌లా పొంగేలా ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇందులో ప్రధానమైన రహస్యం ఏంటంటే.. పిండి కలపడానికి ముందుగా గోరువెచ్చని నీటిలో పంచదార, ఉప్పు, నూనె కలపడం. దీనివల్ల గోధుమపిండిలోని గ్లూటెన్ వేగంగా ఉత్తేజితమై పిండి అత్యంత మృదువుగా మారుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
