
చాలా మందికి రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదంపప్పు తినడం అలవాటు. అయితే బాదంపప్పు నానబెట్టి తింటే మంచిదా.. లేదంటే అలాగే పచ్చిగా తింటే మంచిదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. బాదంపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ మీరు సరైన పద్ధతిలో తింటేనే ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి బాదంపప్పును పచ్చిగా తినాలా? నానబెట్టి ఎలా తినాలా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

బాదంలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా బాదంలో కాల్షియం, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి పోషకాలను అందిస్తాయి. బాదం పప్పును ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కొన్ని బాదంపప్పులను నీళ్లతో వేసి నానబెట్టాలి. తర్వాత వాటిని తొక్క తీసి ఉదయం పూటా ఖాళీ కడుపుతో తినాలి. అలాగే బాదంపప్పును స్నాక్‌గా కూడా తినవచ్చు. పచ్చి వాటి కంటే నానబెట్టిన బాదం శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది.

అలాగే బాదం షేక్ చేసి కూడా తాగొచ్చు. కానీ బాదంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు పెరగడానికి దారితీయవచ్చు. అందుకే వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

నట్ ఎలర్జీ ఉన్నవారు వాటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. ఎలర్జీ ఉన్న వారు వీటికి దూరంగా ఉండటం బెటర్.