Menstrual Health: మీకూ రెగ్యులర్‌గా పీరియడ్స్‌ మిస్‌ అవుతున్నాయా? ఇది కారణం కావచ్చు

|

May 26, 2024 | 1:01 PM

పీరియడ్స్ సమయానికి రాకపోతే సాధారణంగా అమ్మాయిలు కాస్త ఆందోళన చెందుతుంటారు. నిజానికి పీరియడ్స్‌ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. పీరియడ్స్‌ మిస్‌ అవడానికి ఈ కింది అంశాలు కారణాలు అవుతుంటాయి. పీరియడ్స్ సాధారణంగా 28 రోజులకు ఒకసారి వస్తుంది. అయితే అమ్మాయిలందరికీ 28 రోజుల వ్యవధిలో పీరియడ్స్ రావు. 28 రోజులకు 7 రోజుల ముందు లేదా10 రోజుల తర్వాత పీరియడ్ రావచ్చు..

1 / 5
పీరియడ్స్ సమయంలో తరచుగా బాత్రూమ్‌కి వెళ్లకుండా ఉండేందుకు చాలా మంది తక్కువ నీరు తాగుతారు. కానీ, ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నీరు ఎక్కువగా తాగడం వల్ల పొత్తికడుపు నొప్పి నుంచి కండరాల తిమ్మిరి వరకు అనేక సమస్యలు తగ్గుతాయి. అయితే చాలా మంది పీరియడ్‌లో పదే పదే వాష్‌రూమ్‌కి వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తక్కువ నీరు తాగుతారు. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
పీరియడ్స్ సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బలహీనత, అలసటను అధిగమించడానికి శరీరానికి అదనపు పోషకాలు కూడా అవసరం. కాబట్టి ఈ సమయంలో ఆహారంలో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.

3 / 5
అధిక ఒత్తిడి రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల సకాలంలో రుతుక్రమం జరగదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలి. అధిక శరీర బరువు కూడా రుతుక్రమ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని అధిక కొవ్వు ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఋతుస్రావం ఆలస్యం చేసే హార్మోన్. బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

4 / 5
పురుషుల కంటే మహిళలు థైరాయిడ్ సమస్యలతో అధికంగా బాధపడుతుంటారు. థైరాయిడ్ హార్మోన్లు జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ, మహిళల ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఒకవేళ ఎవరికైనా థైరాయిడ్ సమస్యలు ఉంటే.. వారి పీరియడ్ డేట్లు అస్తవ్యస్తంగా ఉంటాయి.

5 / 5
పిసిఒఎస్‌తో క్రమరహిత పీరియడ్స్ వస్తాయి. అలాగే మెనోపాజ్‌కు ముందు క్రమరహిత రుతుక్రమ సమస్యలు వస్తాయి. పీరియడ్స్‌ సక్రమంగా రావడానికి అల్లం టీ త్రాగవచ్చు. అల్లం టీ శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అలాగే బొప్పాయి జ్యూస్‌ కూడా త్రాగవచ్చు. దీంతో పీరియడ్స్ సమస్యలు తొలగిపోతాయి.