5 / 5
చర్మం తేమ కోల్పోకుండా ఉండాలంటే.. స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి, శరీరానికి బాగా పట్టించాలి. అలా గంట పాటు వదిలేస్తే చర్మపోషణకు అవసరమయ్యే పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. త్వరగా పొడిబారకుండా ఉండేలా చేస్తుంది. మరీ అంతగా ఫేస్‌వాష్ చేసుకోవాలనిపిస్తే నీటితో ముఖం కడుక్కోవడానికి బదులుగా.. ఒక్కోసారి తడిగా ఉండే వైప్స్‌ని ఉపయోగించచ్చు. అందులో కూడా వివిధ రకాలా ఫ్లేవర్స్‌తో అందుబాటులో ఉంటాయి.