
అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అబ్బాయిలూ.. అమ్మాయిలూ అందం కోసం తాపత్రయ పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. మెరిసే చర్మం కావాలని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇంట్లోని నేచురల్ రెమిడీస్ చేయడం.. అలాగే మార్కెట్లో దొరికే క్రీములు ఉపయోగించడం.. బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లడం ఇలా చాలానే చేసి ఉంటారు. ఈసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది.

విటమిన్ ఇ క్యాప్సూల్స్ గురించి వినే ఉంటారు. విటమిన్ ఇ.. చర్మానికి, జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు లేకుండా చేస్తుంది. అలాగే జుట్టు బలంగా, పట్టు కుచ్చులా మెరిసేలా చేస్తుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ ఇ క్యాప్సూల్ అనేది ప్రతీ మెడికల్ షాపులోనూ లభ్యమవుతుంది. విటమిన్ ఇ వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని ఇష్తుంది. చర్మ కణాలను బిగుతుగా చేసి, ముడతలు, గీతలు, మచ్చలు లేకుండా చేస్తుంది.

విటమిన్ ఇ క్యాప్సూల్‌ని రోజ్ వాటర్‌లో కలిపి రాస్తే.. మీ ముఖం కాంతి వంతంగా, సాఫ్ట్‌గా మారుతుంది. ఇది మీ ముఖానికి మాయిశ్చరైజర్‌లా కూడా పని చేస్తుంది. మెరిసే చర్మం కావాలంటే విటమిన్ ఇ క్యాప్సూల్‌ని పెరుగులో కలిపి రాసుకోవచ్చు.

శీతాకాలం క్రమంగా కనుమరుగవుతోంది. వెచ్చని గాలులు అప్పుడే ప్రారంభమయ్యాయి. చలికాలం ముగిసిపోతున్నట్లు భావించి చాలా మంది ఈ సమయంలో తమ చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. ఇది అకాల వృద్ధాప్య సంకేతాలకు దారితీస్తుంది.