
చలికాలం వస్తే మార్కెట్లో రకరకాల నారింజ పండ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కాలానుగుణ జలుబు, దగ్గు నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. శరీరంలో వివిధ రకాల విటమిన్ల అవసరం ఉన్నప్పటికీ.. వాటిల్లో విటమిన్ సి అగ్రస్థానంలో ఉంటుంది.

ఎముకల నిర్మాణం, రక్తనాళాల ఆరోగ్యం, గాయం నయం చేయడంలో విటమిన్ సీ శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా, ఈ విటమిన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్తంలో తగినంత విటమిన్ సి ఉండటం చాలా అవసరం. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉందంటే.. కొన్ని లక్షణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే..

నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

థైరాయిడ్ సమస్య - విటమిన్ సి లేకపోవడం వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఆకస్మిక హైపర్ థైరాయిడిజం లక్షణాలు వేగంగా బరువు తగ్గడం, ఆకలిని కోల్పోవడం, గుండె దడ వంటి సమస్యలను కలిగిస్తుంది.

చర్మ వ్యాధులు - విటమిన్ సి లేకపోవడం వివిధ చర్మ వ్యాధులకు కారణమవుతుంది. చర్మం మంట, దురద వంటి లక్షణాలు తలెత్తుతాయి. విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యమైనది. అన్ని రకాల సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.