వీళ్లు ఖర్జూరాలు పొరపాటున కూడా తినకూడదు.. ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా..?

Updated on: Apr 18, 2025 | 5:48 PM

ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు.. ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. తక్షణ శక్తిని అందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, కొంతమంది ఖర్జూరం పండ్లకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు ఖర్జూరాలను తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. లేదంటే, మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎవరు ఆ ఖర్జూరం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
తియ్యటి ఖర్జూరంలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ఖర్జూరం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది.. ఇది వారి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
ఖర్జూరంలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు ఖర్జూరానికి దూరంగా ఉండటం లేదంటే, చాలా తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి ఖర్జూరం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.

3 / 5
ఖర్జూరంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఇది మంచిదే. కానీ, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా హైపర్‌కలేమియాతో బాధపడుతున్నవారు ఎక్కువ పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం. పొటాషియం ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4 / 5
ఖర్జూరంలో సార్బిటాల్ అనే ఒక రకమైన చక్కెర ఆల్కహాల్ ఉంటుంది. కొంతమందికి ఈ సార్బిటాల్ పడకపోవటం వల్ల వారిలో అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటివారు ఖర్జూరం తింటే కడుపు నొప్పి, విరేచనాలు లేదా ఇతర అలర్జిక్ రియాక్షన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది.

5 / 5
Dates

Dates