Side Effects of Aloe Vera: మంచిదని కలబంద తెగ వాడేస్తున్నారా? దీంతో లాభాలేకాదు అనర్ధాలూ మెండే..
చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో కలబంద ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కలబందలోని ఖనిజాలు, విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది జుట్టుకు హైడ్రేషన్, తేమను అందించి, మంటను తగ్గిస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా వాడటం కూడా అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే..
Updated on: Mar 18, 2025 | 1:14 PM

ప్రతి ఇంటి పెరట్లో కనిపించే కలబంద.. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కలబందలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది జుట్టుకు హైడ్రేషన్, తేమను అందించి, మంటను తగ్గిస్తుంది. కానీ వీటిని ఎక్కువగా వాడటం కూడా అంత మంచిది కాదు. జుట్టుకి అలోవెరా జెల్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ముఖం, జుట్టుకు ఎల్లప్పుడూ తాజా కలబంద జెల్ మాత్రమే రాయడం మంచిది. కలబంద ఆరోగ్యంగా లేకుంటే లేదా సరిగ్గా నిల్వ చేయకపోతే అది దుర్వాసన వస్తుంది. ఈ జెల్ బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులతో కలుషితమై ఉంటుంది. దీనివల్ల దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కలబంద జెల్ దుర్వాసనతో కూడి ఉంటే దానిని ఉపయోగించకపోవడమే మంచిది.

జుట్టుకు పూసిన కలబంద జెల్ ను సరిగ్గా కడగకపోతే, అది జుట్టుకు అంటుకుంటుంది. దీనివల్ల జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. ఇది ఇతర జుట్టు ఉత్పత్తులతో చర్య జరిపి మురికి పేరుకుపోవడానికి కూడా కారణమవుతుంది. దీని కణాలు జుట్టులోనే ఉండిపోయి తలపై దుర్వాసనను కలిగిస్తాయి.

కలబందలో జుట్టును బలోపేతం చేసే, తేమను అందించే లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది జుట్టు చిట్లిపోవడానికి, పొడిబారడానికి కారణమవుతుంది. జుట్టు, తల చర్మం, కుదుళ్లకు కలబందను పూయడం వల్ల కూడా అలెర్జీలు, దురద వస్తుంది.

కలబందను ఎక్కువగా ఉపయోగించడం లేదా తలకు ఎక్కువసేపు అప్లై చేసి ఉంచడం వల్ల కూడా చికాకు వస్తుంది. కాబట్టి జుట్టుకు అప్లై చేసే ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఇది చర్మంపై ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించకపోతే అప్పుడు వినియోగించాలి.





























