
భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు ముళ్లతో ఒకటైన వీరు నిండు నూరేళ్లు ఒకరిగా జీవిస్తూ కష్టాల్లో సుఖాల్లో పాలుపంచుకుంటూ జీవనం సాగిస్తారు. ఇక భార్య భర్తలు అన్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండటం అనేది కామన్.

అయితే కొన్ని సార్లు భార్య భర్తలిద్దరూ ఒకే ప్లేట్ లో భోజనం చేస్తుంటారు. అయితే మన పెద్ద వారు చూసినట్లు అయితే ఇలా భార్య భర్త ఒకే ప్లేట్ లో తినకూడదు. ఇలా తినడం మంచికాదు అని చెబుతారు. కాగా, దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

భార్య భర్తలు కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేయడం పై మహాభారతంలో భీష్ముడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడంట. కాగా, అవి ఏవి అంటే. మహాభారతంలో భీష్ముడు ఈ విషయం గురించి యధిష్ఠిరుడికి భార్య భర్తలు కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేయకూడదు అది విషం లాంటిదని చెబుతాడు.

అంతే కాకుండా ఇలా చేయడం వలన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా తర్వాత తర్వాత చాలా చెడు పరిణామాలు అనుభవిచాల్సి వస్తుందని చెప్తాడు. అయితే భీష్ముడు ఇలా చెప్పడంపై పండితులు ఏం చెబుతున్నారంటే.భార్య భర్తలు కలిసి భోజనం చేయడం వలన వారి మధ్య ప్రేమ అనేది ఎక్కువ గా పెరుగుతుంది. దీంతో భర్త ఇతర పనులపై శ్రద్ధ పెట్టలేడు. ఇది కుటుంబ నిర్వాహణకు అస్సలే మంచిది కాదు అనే ఉద్దేశ్యంతో భీష్ముడు ఇలా చెప్పారంటున్నారు కొందరు.

అంతే కాకుండా భార్య కూడా భర్తపై ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఇతర కుటుంబ సభ్యుల బాధ్యతలు నిర్వహించలేదు. అంతే కాకుండా, ఇది వారి కుటుంబ ఆనందానికి ఆటంకం కావచ్చు. ఈ కారణాల వల్లనే భీష్ముడు మహాభారతంలో అలా చెప్పాడు అని చెప్తుంటారు. ఇక ఈ విషయంపై నిపుణులు మాత్రం ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం చేయడం వలన ఒకరి వ్యాధి ఒకరికి రావచ్చు అందుకే అలా తినకూడదు అని చెప్తుంటారు.