వేసవిలో తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. అయితే సమ్మర్ డైట్ లో గుడ్లను తీసుకొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు సూపర్ ఫుడ్స్. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్ డి, బి, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజు గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుడ్లు చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ సమస్యలు లేకుంటే రోజూ గుడ్లు తినవచ్చు.