
బంగాళాదుంపలను దాదాపు ప్రతి ఇంట్లోనూ నిల్వ ఉంటాయి. బంగాళాదుంపలతో కిచిడితో సహా అనేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే చాలా మంది బంగాళాదుంపలు తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. అందుకే వీటిని తినడానికి దూరంగా ఉంటారు.

ఇక పిల్లల నుంచి వృద్ధుల వరకు దాదాపు అన్ని వయసుల వారు బంగాళాదుంపలను తినడానికి ఇష్టపడతారు. బంగాళాదుంపలతో చాలా వంటకాలు తయారు చేస్తారు. ఇవి తినేందుకు చాలా రుచికరంగా కూడా ఉంటాయి.

అయితే బంగాళాదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుందని మనం తరచుగా వింటుంటాం. దీని కారణంగా చాలా మంది బంగాళాదుంపలు తినకుండా ఉంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయని, ఇవి శరీరంలో గ్లూకోజ్‌గా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే బంగాళాదుంపలను అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారంగా పరిగణిస్తారు.

బంగాళాదుంపలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అవి డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల డయాబెటిస్ రోగులు వీటిని మితంగా తీసుకోవాలి.