25 ఏళ్ల షబ్బీర్ ముల్లా విజయపూర్ జిల్లా బబలేశ్వర్ తాలూకాలోని దేవాపూర్ గ్రామానికి చెందినవాడు. బీకామ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మహారాష్ట్రలోని పూణెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుండి పని చేస్తూ సంపాదిస్తున్నాడు. రెండేళ్ల క్రితం స్నేహితుడి సలహాతో పొట్టేళ్ల పెంపకం చేపట్టి ముల్లా ప్రస్తుతం వందలాది పొట్టేళ్లను పెంచుతున్నాడు.
అందరూ మేకలు, గొర్రెల పెంపకం ద్వారా సంపాదిస్తారు. అయితే షబ్బీర్ మాత్రమే బ్రీడింగ్ పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాడు. జిల్లాలోనే తొలిసారిగా బ్రీడింగ్ పోటేళ్లను పెంచుతున్న యువకుడిగా ఖ్యాతి గడించాడు షబ్బీర్. బాగల్‌కోట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పోటేళ్ల పిల్లలను తీసుకొచ్చి పెంచుతున్నాడు.
పోటేళ్ల పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడంతో పాటు క్రమబద్ధమైన పోషక ఆహార ధాన్యాలు, పశుగ్రాసం అందిస్తూ గొర్రెలను ఆరోగ్యంగా ఉంచుతాడు. ముల్లా పెంచిన పొట్టేలు సగటు బరువు 75 నుంచి 80 కిలోలు ఉంటాయి. కొందరు గొర్రెల కాపరులు షబ్బీర్ సకిరోకు ఒక్కో గొర్రెకు రూ.50 వేలు ఇచ్చారు
మూడు నెలల పొట్టేళ్లను తీసుకొచ్చి 6 నుంచి 7 నెలల వరకు పెంచుతున్నాడు. తర్వాత వాటిని విక్రయిస్తాడు. ఒక్కో పొట్టేలు సగటు ధర 15 నుంచి 18 వేల రూపాయలు. అదేవిధంగా ముల్లా పెంచే పొట్టేళ్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఒకొక్క పోటీలు సుమారు 40 వేల రూపాయలకు అమ్ముతారు. అయితే ఎక్కువ ధర ఉంటేనే తన పొట్టేళ్లను విక్రయిస్తానని షబ్బీర్ తెలిపాడు.
రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీలో చేస్తునం ఉద్యోగానికి గుడ్ బై చెప్పి.. పొట్టేళ్లను పెంచాలని నిర్ణయించుకున్న సమయంలో చేతిలో డబ్బులు లేవు. తన కలల ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి వివిధ బ్యాంకులకు ఇచ్చినా తక్కువ భూములున్నాయనే కారణంగా రుణం ఇవ్వలేదు. అయినా పట్టు వదలని షబ్బీర్ తన అన్న భాషా సాబ్‌తో కలిసి డబ్బులు పోగు చేసి పొట్టేళ్ల పెంపకాన్ని చేపట్టాడు.
పొట్టేళ్లు, గొర్రెలు, మేకల పెంపకానికి ఆధునిక షెడ్డు నిర్మించాలి. 100 పొట్టేలు లేదా గొర్రెలు-మేకల పెంపకానికి షెడ్డుని నిర్మించాలి. ఇందు మేరకు 6 నుండి 8 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే షబ్బీర్ ముల్లా ఖర్చులను అదుపు చేయడానికి తక్కువ ఖర్చుతో అన్నివసతులున్న షెడ్డుని నిర్మించాలని భావించాడు. తన ఆలోచనలకు రూపం ఇస్తూ.. 2 నుంచి 2.50 లక్షల రూపాయలతో అన్ని వసతులతో షెడ్డు నిర్మించాడు. తక్కువ డబ్బుతో షెడ్డు నిర్మించి అందరి మెప్పు పొందేలా చేశాడు.
ప్రస్తుతం బెంగుళూరు, చిత్రదుర్గ, మైసూరు, భత్కల్ తదితర ప్రాంతాల నుంచి పొట్టేళ్లకు గిరాకీ ఉంది. మొదటి దశలో పొట్టేళ్లకు మంచి ధరకు విక్రయించాడు. తక్కువ ఖర్చుతో మంచి పొట్టేళ్ల పెంపకం ద్వారా లాభాలను ఆర్జిస్తున్న ముల్లాపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న షబ్బీర్ స్వయం ఉపాధిని చేపట్టి పొట్టేళ్ల పెంపకంతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు దేవాపూర్ గ్రామానికి చెందిన షబ్బీర్ ముల్లా.