1 / 5
ఇప్పుడు మనుషులను ఇబ్బందిపెడుతున్న జలుబు.. 150 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లను కూడా అనారోగ్యానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. డైనోసార్‌లు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లతో కూడా పోరాడాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. చలితో వచ్చే సమస్యలతో డైనోసార్లు పోరాడినట్లుగా డాక్టర్ కె.ఎస్. క్యారీ వుడ్రఫ్ తన పరిశోధనలో వెల్లడించారు.