Most Unique Animals: ఈ జంతువులు ఆహారం లేకుండా నెలల తరబడి బతికేస్తాయి..
ప్రతి జీవి బ్రతకాలంటే ఆహారం చాలా అవసరం. ఏమీ తినకపోతే ఏ జీవి అయినా ఎక్కువ కాలం బతకలేదు. కాబట్టి శరీరానికి కావలసిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మనిషితో సహా ఏ ప్రాణి ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని జీవులు ఏమీ తినకుండా నెలల తరబడి జీవించగలవని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.. తాబేలు ఎక్కువ కాలం జీవించే జంతువుగా..
Updated on: Nov 08, 2023 | 9:12 PM

ప్రతి జీవి బ్రతకాలంటే ఆహారం చాలా అవసరం. ఏమీ తినకపోతే ఏ జీవి అయినా ఎక్కువ కాలం బతకలేదు. కాబట్టి శరీరానికి కావలసిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మనిషితో సహా ఏ ప్రాణి ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించలేదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని జీవులు ఏమీ తినకుండా నెలల తరబడి జీవించగలవని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.. తాబేలు ఎక్కువ కాలం జీవించే జంతువుగా పరిగణించబడుతుంది. తాబేలు ఏమీ తినకుండా నెలల తరబడి బతుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

గిలా మాన్స్టర్ అనేది ఒక విషపూరిత సెయిల్ ఫిష్. దీనికి కడుపులో ఆహారాన్ని నిల్వచేసే శక్తి ఉంది. అలా కొన్ని నెలలపాటు ఏమీ తినకుండా జీవిస్తుంది.

బొద్దింక కూడా ఏమీ తినకుండా వారాల తరబడి జీవించగల ఒక క్రిమి.

ఒంటె కూడా ఏమీ తినకుండా నెలల తరబడి జీవించగలదు. ఒంటె తన మూపురంతో నీళ్లను, ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది.

కొమోడో డ్రాగన్ అనే జీవి కూడా ఏమీ తినకుండా జీవించగలిగే ఓ ప్రాణి. ఇది ఏదైనా జంతువును తింటే, దాదాపు నెల రోజుల పాటు ఆహారం లేకుండా జీవించగలదు.




