NASA Perseverance Rover: అంగారక గ్రహంపై ఆసక్తికర దృశ్యం.. క్లిక్‌మనిపించిన నాసా పర్సీవరెన్స్ రోవర్.. మీరూ చూసేయండి..

| Edited By: Ravi Kiran

Apr 08, 2021 | 8:02 AM

NASA Perseverance Rover: అంగారక గ్రహంపై ఆసక్తికర దృశ్యం.. క్లిక్‌మనిపించిన నాసా పర్సీవరెన్స్ రోవర్.. మీరూ చూసేయండి..

1 / 8
భూమిపై ‘ఇంద్రధనస్సు’ ఏర్పడటం సర్వ సాధారణం. అందమైన ‘ఇంద్రధనస్సు’ను ఎన్నోసార్లు మనం చూసుంటాం. మరి ఇతర గ్రహాలపై ఏర్పడే ‘ఇంద్రధనస్సు’ను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి.

2 / 8
మార్స్‌ అధ్యయనం కోసం నాసా పంపిన పర్సీవరెన్స్ రోవర్.. అద్భుతమై దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. భూమిపైనే కాదు.. అంగారకుడిపైనా ఇంద్రధనస్సు ఏర్పడుతుందని ప్రపంచానికి చాటి చెప్పింది.

3 / 8
ఇంద్రధనుస్సు ఏర్పడటం.. వర్షం రాకకు సూచనగా భావిస్తారు. ఆ నేపథ్యంలోనే మార్స్‌పైనా వర్షాలు కురుస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో నాసా సైటింస్ట్‌లు కూడా తమ పరిశోధనల్లో వేగం పెంచారు.

4 / 8
భూమికి సమీపంగా ఉండి.. దాదాపు భూమిని పోలి ఉన్న అంగాకర గ్రహంపై జీవి ఉనికి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మార్స్‌పై అధ్యయనానికి వరుస ప్రయోగాలు చేపడుతున్నాయి. చాలా దేశాలు ఉపగ్రహాలను పంపించి మార్స్‌ను అధ్యయనం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

5 / 8
అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్.. ఆ గ్రహానికి సంబంధించిన అనేక రహస్యాలను చేధించడం బిజీ బిజీగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే అనేక ఫోటోలను పంపిన రోవర్.. తాజాగా మార్స్‌పై ఇంద్రధనుస్సు ఏర్పడటాన్ని గుర్తించింది. దానికి సంబంధించిన ఫోటోను కూడా నాసా కేంద్రానికి పంపించింది.

6 / 8
శాస్త్రవేత్తల ప్రకారం.. మార్స్‌పై వర్షం పడే అవకాశం లేదు. అందుకని, ఈ ఇంద్రధనస్సుని శాస్త్రవేత్తలు ‘డస్ట్‌బౌ’ గా భావిస్తున్నారు. అంటే నీటి బింధువులకు బదులుగా.. దుమ్ము, దూళి వల్ల ఈ ధనస్సు ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల భావన.

7 / 8
ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కెమెరాలో చూపినట్లుగా రెయిన్‌బో ఉండకపోవచ్చంటున్నారు. కాంతి కిరణాలు కెమెరా లెన్స్‌పై పడటంతో ఆ కిరణాలు విచ్చిన్నం చెంది ఇలా కనిపించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

8 / 8
‘డస్ట్‌బౌ’ వినడానికి మనందరికీ కొత్త అయినప్పటికీ.. మార్స్‌కు మాత్రం కొత్తేం కాదు. మార్స్‌పై ఎక్కువగా ‘ఐఎస్‌బౌ’లు ఏర్పడుతుంటాయి. 2015లో నాసా ‘ఏదైనా అడుగొచ్చు’(ఆస్క్‌ మి ఎనీథింగ్) అనే కార్యక్రమం నిర్వహించిన సందర్భంలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. 1990లో పాథ్‌ఫైండర్ మిషన్ సందర్భంలోనే మార్స్‌పై ‘ఐస్‌బౌ’ను తొలిసారి కనుగొన్నట్లు నాసా వెల్లడించింది.