
కావాల్సిన పదార్థాలు : బియ్యం రెండు కేజీలు, బెల్లం 500 గ్రాములు, యాలకులపొడి, వన్ టీస్పూన్, నెయ్యి వన్ టేబుల్ స్పూన్, ఆయిల్ వేయించడానికి సరిపడ. తయారీ విధానం, తియ్య తియ్యటి బెల్లం అరిసెలు తయారు చేసుకోవడానికి ముందుగా, బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కనీసం 24 గంటల పాటు నానబెట్టాలి. ఈ క్రమంలో మధ్యలో మూడు లేదా నాలుగు సార్లు ఆ బియ్యాన్ని కడుగుతూ, నీళ్లు పారబోసి, కొత్త నీరుతో నానబెడుతూ ఉండాలి. దీని వలన బియ్యం వాసన రాకుండా శుభ్రంగా ఉంటాయి.

తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి, వాటర్ లేకుండా చేసి, పొడి క్లాత్ పై బియ్యాన్ని వేయాలి. తర్వాత క్లాత్ పై బియ్యాన్ని పలచగా వేసి, 20 నిమిషాల వరకు తడి ఆరే విధంగా ఆరబెట్టుకోవాలి. బియ్యాన్ని ఎండలో ఆరబెట్టడం చేయకూడదు.

దీని తర్వాత బెల్లాన్ని చిన్నగా తరుముకొని, మిక్సీలో వేసి, గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర బెట్టుకున్న బియ్యాన్ని పెద్ద మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. పిండి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అరిసెల కోసం పిండి రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

ముందుగా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం, తురుముకున్న బెల్లాన్ని , కప్పు నీళ్లు పోసి, చిన్నమంటపై పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత పాకం వచ్చా, అందులో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి, నెయ్యి, వీలైతే నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకం మిశ్రమంలో బియ్యం పిండిని వేస్తూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి.

పిండి అనేది కన్సిస్టెన్సీగా, మరి గట్టిగా, మరి లూజ్‌గాఉండకుండా చూసుకోవాలి. తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసి, పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం వేడి తగ్గి, కాస్త గోరు వెచ్చగా ఉన్న సమయంలో అరిసెల్లా తయారు చేసుకోవాలి.చపాతీ పీటపై లేదా, కవర్, లేదా, కాటన్ క్లాత్ పై అరిసెల్లా తయారు చేసుకొని, స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి అందులో వేయించడానికి సరిపడ నూనె వేసి, అందులో వేస్తూ వేయించుకోవాలి. అరిసెలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. అవి పొంగుతూ ఉండాలి. అంతే తియ్య తియ్యని, సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ.