
ప్రతి మానవ శరీరంలో ఎక్కడో ఒకచోట పుట్టుమచ్చలు ఖచ్చితంగా కనిపిస్తాయి. సైన్స్ ప్రకారం శరీరంపై పుట్టుమచ్చ ఉండటం సాధారణ ప్రక్రియ. అయితే హిందూ మతంలో పుట్టుమచ్చలుండే స్థానం బట్టి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయని నమ్మకం. సాముద్రిక శాస్త్రంలో శరీరంపై పుట్టుమచ్చల అర్థం వివరించబడింది. ఇది మానవునికి శుభకరమైనది, అశుభకరమైనది అని రుజువు చేస్తుంది.

ఈ పుట్టుమచ్చ ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి, అతని స్వభావం ఎలా ఉంటుందో కూడా చెబుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం శరీరంలో పుట్టుమచ్చ ఉన్న భాగం గురించి తెలుసుకుందాం. అంటే కడుపు మీద(పొట్టపై) పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. అతను తినడానికి, త్రాగడానికి ఇష్టపడతాడని కూడా అంటారు.

సాముద్రిక శాస్త్రం ప్రకారం కడుపుపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు, పురుషులపై వేర్వేరు ప్రభావాలను చూపుతుంది. పురుషుల కడుపుపై పుట్టుమచ్చ ఉండటం అంటే వారు కెరీర్ రంగంలో ముందుంటారని, వారికి డబ్బుకు కొరత ఉండదని చెబుతారు.

మరోవైపు స్త్రీల కడుపుపై పుట్టుమచ్చ ఉండటం అంటే వారు కుటుంబంలో ఆనందం, పిల్లల వలన ఆనందం, వైవాహిక జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందుతారు. ఈ స్త్రీల జీవితంలో దాదాపు ఒత్తిడి ఉండదు. అంతే కాదు కడుపు మీద వివిధ ప్రాంతాల్లో పుట్టుమచ్చ ఉంటే.. దానికి కూడా వేర్వేరు అర్థాలు ఉంటాయని సాముద్రిక శాస్త్రం కూడా చెప్పబడింది.

పొట్టపై కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. వీరికి ఎల్లప్పుడూ తమ లక్ష్యం గురించి స్పష్టమైన దృష్టి ఉంటుంది. దీనిని సాధించిన తర్వాతే వీరు సంతృప్తి చెందుతారు. అలాంటి వ్యక్తులు కెరీర్‌తో సహా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అంతేకాదు వీరి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. వీరి జీవితంలో ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం ప్రజలపై చాలా ప్రభావం చూపుతుంది.

పొట్టపై ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే.. అటువంటి వ్యక్తుల జీవితం చాలా సవాలుతో కూడుకున్నది. అతను తన లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాలి. అప్పుడే అదృష్టం అతనికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఇలా పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎక్కువగా మాట్లాడతారు. అంతేకాదు ఆస్థిపరులు.

పొట్టమీద పుట్టుమచ్చ ఉందని చెప్పడానికి మరో సంకేతం ఏమిటంటే.. ఇలా పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. కనుక వీరు ఎప్పుడూ ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు ఇలా పుట్టుమచ్చలు ఉన్నవారికీ తినడం అంటే మహా ఇష్టం. వీరు తినాలనే కోరికను అసలు నియంత్రించుకోలేరట. (ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)