సమ్మక్క, సారక్కలు దేవతలుగా ఎలా మారారు.. ఆ కథ తెలిస్తే కన్నీరు పెట్టాల్సిందే!

Updated on: Jan 24, 2026 | 12:34 PM

మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది వీరిద్దరూ మనుషులా లేక దేవతలా అని? ఆ కథ ఏంటో తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండలేరు.. అదేంటో ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకుందాం...

1 / 5
సమ్మక్క, సారక్కలు అనే ఈ ఇద్దరూ మానవ జన్మ ఎత్తి, గిరిజనులను కోసం ప్రాణాలు పోగొట్టుకుని వీరమరణం పొందిన ఈ కథ గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండలేరు.  వారి కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చెయ్యలేదు. అలా వాళ్ళు దేవతలుగా మారారు. మేడారం జాతరలో సమ్మక్క, సారక్కలను వనదేవతలుగా భావించి బెల్లం కానుకగా ఇస్తారు.

2 / 5

12 వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడ రాజు ఏకైక కూతురు సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి  చేశారు.

3 / 5
వీరిద్దరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే, రాజ్య విస్తరణలో భాగంగా  కాకతీయ ప్రభువు మొదటి ప్రతాప రుద్రుడు మేడారం పై దండెత్తాడు. ఆ యుద్ధంలో ఎవరూ ఊహించని విధంగా మేడ రాజు, పగిడిద్ద రాజు , సారలమ్మ , నాగులమ్మ, గోవింద రాజులు మరణించారు.

4 / 5
ఇక శత్రువుల చేతిలో బాగా దెబ్బ తిన్న సమ్మక్క ఆ రక్తపు ధారలతోనే చిలుక గుట్ట వైపు వెళ్ళింది. కానీ, దారి మధ్యలోనే  కనిపించకుండా మాయమైంది. ఏంటబ్బా ఎలా అదృశ్యమైందని అందరికీ పెద్ద ప్రశ్నలాగా మిగిలింది.

5 / 5
సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ప్రజలకు ఎంత వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణెలు కనిపించాయి. వాటిలో  కుకుంమ భరణిని సమ్మక్కగా .. పసుపు భరణి సారక్కగా భావించి ప్రతి రెండేళ్ల కొకసారి 
 మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను ఘనంగా జరుపుతారు.

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ప్రజలకు ఎంత వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణెలు కనిపించాయి. వాటిలో కుకుంమ భరణిని సమ్మక్కగా .. పసుపు భరణి సారక్కగా భావించి ప్రతి రెండేళ్ల కొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను ఘనంగా జరుపుతారు.