
బియ్యం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా బయట పెట్టరు. అటూ ఇటూ నడుస్తూ సరదాకి బియ్యం తింటున్నారు అనుకుంటారు. కానీ బియ్యాన్ని తినాలి అనిపించేలా చేయడానికి ఈ లోపమే కారణం. బియ్యం తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

బియ్యం తినకూడదని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. కానీ లెక్క చేయకుండా తింటూ ఉంటారు. ఇలా బియ్యం తినడానికి శరీరంలో ఈ మార్పులే కారణం. రక్త హీనత సమస్య, విటమిన్ బి12 శరీరంలో తక్కువగా ఉండటం వల్ల బియ్యాన్ని తినాలనిపిస్తుంది.

బియ్యాన్ని అన్నం రూపంలో తింటే అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ అలా కాకుండా నేరుగా బియ్యం తింటే మాత్రం సమస్యలు తప్పవు. ఇలా బియ్యం తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు నొప్పి వస్తుంది.

మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. మూత్ర పిండాల సమస్యలు కూడా తలెత్తుతాయి. బలహీనంగా, నీరసంగా ఉంటారు. ఒక్కోసారి విరోచనాలు, వాంతులు కూడా అవుతాయి. వైట్ ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది.

అందరితో యాక్టీవ్‌గా ఉండలేరు. ముఖం అంతా పాలిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడేందుకు ఇష్ట పడరు. ఆహారం కూడా తినబుద్ధి కాదు. కాబట్టి ఎవరైనా పచ్చి బియ్యం తింటే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)