కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్య ఏర్పడి అందులో వచ్చే పొట్టకు సంబంధించిన సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. పిత్తాశయం రాళ్లను ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. అయితే కొన్ని సులభమైన ఇంటి నివారణలతో కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ హోం రెమెడీస్ గురించి తెలుసుకోండి..
ఆలివ్ ఆయిల్: రోజూ కొద్దిగా.. సుమారు రెండు చెంచాల ఆలివ్ నూనె తీసుకునేవారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ముప్పు తక్కువని ఇటీవలి అధ్యయనాలు తెలింది. ఆలివ్‌నూనెలోని ఒక పదార్థం రక్తంలో, పిత్తాశయంలో కొలెస్ట్రాల్ మోతాదు తగ్గటానికి తోడ్పడుతుంది. ఆలివ్ నూనెను ఎక్కువగా వాడే ప్రాంతాల్లో నివసించేవారిలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం తక్కువని పరిశోధకులు గుర్తించారు.
యాపిల్ సైడర్ వెనిగర్: పిత్తాశయంలోని రాళ్లను మృదువుగా చేయడానికి యాపిల్ సైడర్ వెనిగర్ పనిచేస్తుందని చెబుతారు. రోగులు రాళ్ల విషయంలో యాపిల్ సైడర్ వెనిగర్ నీటిని తాగడం మంచిది. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో కలుపుకుని తాగండి.
డాండెలైన్: దీని ప్రత్యేక ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉంది. దీనిని తీసుకోవడం ద్వారా పిత్తాశయం, కాలేయం, పిత్త వాహిక సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. ఇందులో ఉండే చేదు మూలాలు గాల్ బ్లాడర్‌లో పిత్త సమస్యలను తగ్గిస్తాయని నమ్ముతారు.
ఎక్కువ నీరు త్రాగండి: శరీరానికి సంబంధించిన చాలా సమస్యలను అధిగమించడానికి నీరు దివ్యౌషధంగా పని చేస్తుంది. పిత్తాశయంలోని రాళ్లను తొలగించడానికి నీరు కూడా సహాయం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ సరైన మోతాదులో నీరు త్రాగడం వల్ల రాళ్ల సమస్యలు దగ్గరకు రావు. అయితే ఈ సమస్య వచ్చినా నీటితో చాలా వరకు అధిగమించవచ్చు.