Jio Bharat 4G sale in India via Amazon: రిలయన్స్ జియో ఇటీవల కేవలం రూ. 999 లకే 4జి ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ 4జి ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.
రిలయన్స్ జియో ఇటీవల భారతదేశంలో జియో భారత్ పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G సపోర్ట్ ఇస్తుంది. ఇక ధర కేవలం 999 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ఈ ఫోన్ విక్రయ తేదీని అమెజాన్ ప్రకటించింది. Jio Bharat 4G ఫోన్ ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
భారతదేశాన్ని ‘2G-రహిత భారత్’గా మార్చడానికి Jio ఈ ఫోన్‌ను విడుదల చేసింది. Jio Bharat 4G ఫోన్ చాలా తక్కువ ధరకు విక్రయించబడుతుంది. వినియోగదారులు రిలయన్స్ డిజిటల్ స్టోర్, జియో మార్ట్‌తో సహా రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
జియో భారత్ ఫోన్ ఇతర ఫీచర్ ఫోన్‌ల మాదిరిగానే కనిపిస్తుంది. కీ-ప్యాడ్ ఆప్షన్, వెనుక కెమెరా, స్పీకర్, జియో లోగో ఉన్నాయి. ఇక కాల్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కడికైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.
Jio Bharat 4G ఫోన్‌లలో Jio Pay ద్వారా UPI లావాదేవీలు చేయవచ్చు. జియో సినిమా, జియో సావన్, FM రేడియోల ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తం 1 మిలియన్ జియో భారత్ ఫోన్‌లు ప్రారంభించడం జరిగింది.
జియో భారత్ ఫోన్‌ల కోసం బేస్ రీఛార్జ్ ప్లాన్ కూడా ప్రకటించబడింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.123 మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్, 14GB డేటాను పొందవచ్చు. దీనికి ఒక నెల వాలిడిటీ ఉంది. అదనంగా రూ. 1234తో 168GB డేటాను అందించే ఒక సంవత్సరం ప్లాన్ కూడా ఉంది. అపరిమిత కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.